ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే.. ఏమౌతుందో తెలుసా..?

అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుంది. అంజీరాలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ది బెస్ట్‌ ఛాయిస్‌. ఫైబర్‌ పొట్ట నిండిన భావన కలిగిస్తుంది కాబట్టి.. ఆకలి కూడా వెంటనే రాదు. అంజీరాలోని పొటాషియం రక్త పోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యాధుల్ని దూరం చేస్తాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీరాలను తింటే.. ఏమౌతుందో తెలుసా..?
soaked anjeer

Updated on: Jun 16, 2025 | 9:14 PM

అంజీరా తినేందుకు చాలా రుచిగా ఉండటమే కాదు.. పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని నానబెట్టి రోజూ ఉదయాన్నే తీసుకుంటే ఓరల్‌ హెల్త్‌కు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. నానబెట్టిన అంజీరాలో రిచ్‌ డైటరీ ఫైబర్‌ ఉంటుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఇందులోని అధిక ఫైబర్‌ వల్ల నీరసం ఉండదు. నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఖాళీ పొట్టతో అంజీరాను తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంజీరాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని చేసే రాడికల్స్‌తో పోరాడతాయి. చర్మం పాడుకాకుండా చూస్తాయి. రోజూ ఉదయం నానబెట్టిన అంజీరా తింటే.. యంగ్‌గా కనిపిస్తారు.

కొంతమంది ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నీరసంగా ఫీల్‌ అవుతుంటారు. అలాంటి వారు కొన్ని అంజీరాలను నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తింటే టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం శరీరంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంజీరా ఎముకలకు కావాల్సిన బలాన్ని ఇస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్‌ ఇందులో ఉండటం వల్ల ఎముకల్ని బలంగా చేస్తాయి. నానబెట్టిన అంజీరాను తరచూ తీసుకుంటే ఎముకల వ్యాధులు దరిచేరవు.

ఉదయాన్నే ఖాళీ పొట్టతో అత్తి పండ్లను తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మరీ ఎక్కువ తీసుకోవద్దు. రోజుకు రెండుకు మించి తినకపోవడమే మంచిది. అంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య తొలగిపోతుంది. అంజీరాలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ది బెస్ట్‌ ఛాయిస్‌. ఫైబర్‌ పొట్ట నిండిన భావన కలిగిస్తుంది కాబట్టి.. ఆకలి కూడా వెంటనే రాదు. అంజీరాలోని పొటాషియం రక్త పోటును నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యాధుల్ని దూరం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..