Cauliflower Side Effects: క్యాలీఫ్లవర్‌ను ఈ సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతీ..!

|

Jan 19, 2023 | 1:27 PM

క్యాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇక క్యాలీ ఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె, ఫైటో న్యూట్రిఎంట్స్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అయితే క్యాలీఫ్లవర్ గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ రసాయనాలను..

Cauliflower Side Effects: క్యాలీఫ్లవర్‌ను ఈ సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతీ..!
Cauliflower
Follow us on

ఆహారంలో భాగంగా మనం నిత్యం తినే ఆకుకూరలు, కూరగాయలు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతాయి కూరగాయలు. అయితే కొన్ని రకాల కూరగాయలను పరిమితికి మించి తినకూడదు. అలా తినడం వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవడమే అవుతుంది కూడా. ఇక అలా ఎక్కువగా తినకూడని వెజిటెబుల్స్‌లో క్యాలీఫ్లవర్ కూడా ఒకటి. మనలో చాలా మంది క్యాలీ ఫ్లవర్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. కాలీఫ్లవర్ కర్రీ, ఫ్రై, మంచూరియా ఇలా ఎవరికి నచ్చినది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.

క్యాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇక క్యాలీ ఫ్లవర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కె, ఫైటో న్యూట్రిఎంట్స్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. అయితే క్యాలీఫ్లవర్ గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ రసాయనాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని తినడం కొంతమందికి సమస్యాత్మక పరిస్థితులకు తీసుకురాగలదు. మరి ఎవరు  క్యాలీఫ్లవర్‌ను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

థైరాయిడ్ సమస్య: థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. థైరాయిడ్ సమస్య వున్నవాళ్లు దీనిని తమ ఆహారంలో తీసుకుంటే T-3, T-4 హార్మోన్లు పెరిగి థైరాయిడ్ సమస్యని ఎక్కువ చేస్తాయి.

ఇవి కూడా చదవండి

కడుపులో గ్యాస్: క్యాలీఫ్లవర్‌లో రాఫినోస్ అనేది హానికరమైన పదార్థం కూడా ఉంటుంది. ఇది ఒక కార్బోహైడ్రేట్. ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే అది చిన్న పేగు నుంచి పెద్ద పేగులకు వెళ్లి.. బ్యాక్టీరియా కిణ్వ ప్రక్రియ మొదలు పెట్టడంతో.. కడుపులో గ్యాస్ కలుగుతుంది. కడుపు కూడా ఉబ్బుతుంది.

బరువు సమస్య: బరువు పెరగాలి అనుకుంటే క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే దీన్ని తీసుకుంటే ఆకలి పుట్టదు. అలానే పాలిచ్చే తల్లుల్లు కూడా దీనిని తీసుకోకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..