మనం ఇష్టపడి తినే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. చాలా మంది ఈ కూర అంటే పడి చస్తారు కూడా. వంకాయలోనూ గుత్తి వంకాయ అంటే దానికి ఎక్కడా లేని ప్రత్యేకత, విశిష్టతను అందిస్తారు మన వంకాయ ప్రియులు. వంకాయ రుచికి మాత్రమే కాక.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే వైద్య నిపుణులు సూచనల మేరకు కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఈ వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయలో ఉండే పోషకాలు వారి శరీరంపై ప్రతికూల ఫలితాలను చూపడమే అందుకు కారణమని పేర్కొంటున్నారు నిపుణులు. ఈ మాటలను కాదని తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఎవరెవరు ఈ వంకాయను తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కళ్ల సమస్య: కళ్లలో ఏదైనా సమస్య ఉన్నవారు వంకాయ కూరలకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద ఉంటే వంకాయ తినవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
హేమోరాయిడ్: పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను తినొద్దని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని తినడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీ స్టోన్స్: కిడ్నీలో రాళ్లు ఉంటే వంకాయను అస్సలు తినొద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుందంట.
అలెర్జీ: ఏదైనా అలెర్జీ సమస్య ఉన్నట్లయితే వంకాయను తినవద్దు. ఎందుకంటే దీనిని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
డిప్రెషన్: డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే, లేదా ఇతర ఆందోళనలతో బాధపడుతున్నట్లయితే వంకాయ కూరను తినకుండా ఉండాలి. ఎందుకంటే.. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
రక్తహీనత: రక్త హీనతతో బాధపడేవారు వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే ఇవి రక్తం పెరుగుదలకు అడ్డంకిగా పనిచేస్తాయి. ఈ కారణంగా రక్తం తక్కువగా ఉన్నవారు వంకాయ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
జీర్ణసమస్యలు: జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే వంకాయతో చేసిన కూరలు తీనకూడదు. కారణం.. ఇది గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..