Health Tips: ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాల్సిందే..

Health Tips: ఉసిరికాయ మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే..

Health Tips: ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాల్సిందే..
Amla Side Effects

Updated on: Sep 27, 2023 | 10:11 PM

Health Tips: ఉసిరికాయ మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో ఉపకరిస్తాయి. ఉసిరి ఆరోగ్యానికే కాక అందానికి కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇందులో విటమిన్, ఎ, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉండడమే అందుకు కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఉసిరికాయలకు కొందరు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు ఉసిరికాయలను తీసుకుంటే సమస్యలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏయే సమస్యలు ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

లో షుగర్: రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు ఉసిరికి దూరంగా ఉండాలి. ఒక వేళ తీసుకున్నా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. లేదంటే ఉసిరి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని మరింతగా తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదం.

కడుపు సమస్యలు: ఉసిరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అయితే అతిగా ఉసిరికాయలను తీసుకుంటే ఇందులోని విటమిన్ సి హైపర్ హైపర్ యాసిడిటీ సమస్యలను కలిగిస్తుంది.

సర్జరీ: ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్నవారు కూడా ఉసిరికాయలను కనీసం 5, 6 నెలల పాటు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డీహైడ్రేషన్: డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారు ఉసిరికాయలకు దూరంగా ఉండాలి. ఉసిరిని తీసుకున్నప్పుడు నోరు ఆరిపోయిన భావన కలుగుతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్ ఉన్నవారు తీసుకుంటే శరీరంపై మరింత ప్రభావం పడి సొమ్మగిల్లి పడిపోయే ప్రమాదం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..