Weight Loss Tips: ఈ 4 సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చండి.. బరువును ఈజీగా తగ్గించుకోండి.!

|

Oct 10, 2021 | 10:46 AM

కార్బోహైడ్రేట్స్.. మన ఆహారంలో వీటి శాతం చాలా ముఖ్యం. ఎందుకంటే.. శరీరానికి కార్బోహైడ్రేట్ల ద్వారానే కావల్సినంత శక్తి లభిస్తుంది...

Weight Loss Tips: ఈ 4 సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చండి.. బరువును ఈజీగా తగ్గించుకోండి.!
Foods
Follow us on

కార్బోహైడ్రేట్స్.. మన ఆహారంలో వీటి శాతం చాలా ముఖ్యం. ఎందుకంటే.. శరీరానికి కార్బోహైడ్రేట్ల ద్వారానే కావల్సినంత శక్తి లభిస్తుంది. అయితే బరువు తగ్గాలనుకుంటున్నవారు మాత్రం.. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నప్పటికీ.. బరువు తగ్గడానికి సహాయపడే ఆ 4 సూపర్ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

అరటిపండు:

అరటిపండ్లు ఎక్కువగా తీసుకుంటే.. మీరు బరువు పెరగొచ్చు. కానీ ప్రతిరోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల.. అవి మీ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లతో శరీరానికి కావాల్సిన శక్తి, అవసరమైన పోషకాలు లభిస్తాయి.

వోట్ మీల్:

మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఖచ్చితంగా ఓట్ మీల్‌ను మీ డైట్‌లో చేర్చండి. పిండి పదార్థాలు మాత్రమే కాకుండా, వోట్ మీల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవి కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

బార్లీ:

ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు అధికంగా ఉండే బార్లీని రోటీల రూపంలో తీసుకోవచ్చు. మీ రెగ్యులర్ పిండితో బార్లీ పిండిని కలిపి రోటీలు చేయండి. ఇలా చేయడం మీ శరీరానికి శక్తి సమకూరడమే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది. దీనితో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

చిలగడదుంపలు:

చిలగడదుంపలలో అధిక ఫైబర్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు ఉన్నాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే దానిని ఉడకబెట్టి తినడం లేదా కాల్చుకుని తినండి. దీనిని తీసుకోవడం ద్వారా, మీ శరీరం మంచి బ్యాక్టీరియాను పొందటమే కాకుండా.. జీవక్రియ పెరుగుతుంది.