ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు..! ధర తెలిస్తే షాక్ అవుతారు.. ఎక్కడ పండిస్తారో తెలుసా?

|

Apr 11, 2021 | 5:24 AM

World Expensive Fruits : మార్కెట్లో పండ్లు కొనడానికి వెళితే బేరమాడి తక్కువ ధరలో కొంటుంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే పండ్ల గురించి వింటే నోరెళ్ల బెడతారు. ఎందుకంటే వీటిని బేరమాడలేం కాదా కనీసం టచ్‌

ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు..! ధర తెలిస్తే షాక్ అవుతారు.. ఎక్కడ పండిస్తారో తెలుసా?
World Expensive Fruits
Follow us on

World Expensive Fruits : మార్కెట్లో పండ్లు కొనడానికి వెళితే బేరమాడి తక్కువ ధరలో కొంటుంటాం కానీ ఇప్పుడు చెప్పబోయే పండ్ల గురించి వింటే నోరెళ్ల బెడతారు. ఎందుకంటే వీటిని బేరమాడలేం కాదా కనీసం టచ్‌ కూడా చేయలేం. ఎందుకంటే వీటి ధర మామూలుగా ఉండదు. ఒక్కో పండు లక్షల ధర పలుకుతుంది. ప్రపంచంలోనే ఖరీదైన పండ్లుగా గుర్తింపుతెచ్చుకున్నాయి. పండ్లను లక్షలు పెట్టి ఎవరైనా కొంటారా? అంటే కొంటారు ఎందుకంటే వాటి విలువ అదే మాదిరిలో ఉంటుంది కనుక. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1. కొన్ని దేశాలలో లభించే మామిడి కాయ రూ.70 వేల నుంచి లక్ష వరకు పలుకుతుంది. 2010 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టాప్ ఎండ్ రకానికి చెందిన 12 మామిడి పండ్ల ట్రే 50,000 డాలర్లకు అమ్ముడైంది. అంటే మన కరెన్సీలో చూస్తే రూ.37,23,127 అన్నమాట. ఆస్ట్రేలియాలో 1998 నుండి మామిడి వేలం నిర్వహించడం ఒక ఆనవాయితీ కాగా బ్రిస్బేన్‌లో జరిగిన ఒక వేలం పాటలో ఈ రికార్డు ధర నమోదైంది.

2.పుచ్చకాయలో ‘డెన్సుకే’ రకం అనేది చాలా అరుదైన పండు. దీనిని జపాన్‌లోని హక్కైడోలో పండిస్తారు. ఇది పండు మొత్తం నల్లగా ఉంటూ ఇతర స్థానిక రకాలైన పండ్ల కన్నా తియ్యగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా జపాన్ లో మాత్రం స్పెషల్ పండు. అందుకే అక్కడ ఈ పండు ఎల్లప్పుడూ అధిక ధరకు అమ్ముతారు. అయితే 2014లో డెన్సుకే పుచ్చకాయ ఒకటి ఆరువేల డాలర్లకు అమ్ముడైంది. అంటే మన ధరలో ఇది రూ.3,27,262 రూపాయలు అనమాట.

3.యుబారి కింగ్ మెలోన్స్ అనే పండు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. ఈ పండు కూడా జపాన్ లో పండించబడుతుండగా జపాన్ వెలుపల ఎక్కువగా ఈ పండును ఎగుమతి చేయరు. ఇది ఒకరకంగా పుచ్చకాయను పోలి ఉంటుంది. పసుపు పచ్చ రంగులో గుజ్జు, పండు పైన గుమ్మడి కాయ రంగులో ఉంటుంది. ఈ రకమైన పుచ్చకాయల ధర లక్షల రూపాయల్లోనే ఉంటుంది. 2018లో ఒక జత యుబారి పుచ్చకాయలు 29,300 డాలర్లకు వేలం జరిగింది. అంటే మన కరెన్సీలో రూ.21,81,752.

4.యూకేలోని గిగాంటెల్లా మాగ్జిమ్ అనే స్ట్రాబెర్రీస్‌ సాధారణ స్ట్రాబెర్రీల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రతి స్ట్రాబెర్రీ పండు టెన్నిస్ బంతి పరిమాణంలో పెద్దదిగా పెరుగుతూ ఒక కొత్త రకం రుచిని కలిగి ఉంటుందట. అందుకే 2017లో జరిగిన ఒక వేలంలో గిగాంటెల్లా మాగ్జిమ్ రకం స్ట్రాబెర్రీ ఒకటి 4,395 డాలర్లు పలికిందట. అంటే సుమారు మన కరెన్సీలో రూ. 2,39,719.

5. రూబీ రోమన్ ద్రాక్ష అనే పండ్లు జపాన్ లో కనిపిస్తాయి. ఒక కార్టన్ రూబీ ద్రాక్ష ఏడు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉండే ఈ ద్రాక్షను దాని ఖరీదు కారణంగానే ధనవంతుల ఫలం అంటారు. కాగా 2016లో రూబీ రోమన్ ద్రాక్ష ఒక్క గుత్తి 14,600 డాలర్లకు అమ్ముడై రికార్డు నమోదు చేసింది. అంటే మన కరెన్సీలో రూ.10,87,153 అనమాట.

చెన్నైపై విజయం సాధించిన ఢిల్లీ.. శిఖర్‌ ధావన్‌ దాడికి చతికిలపడిన సీఎస్‌కే బౌలర్లు.. రాణించిన పృథ్వీ షా..

Dead Whale : బంగ్లాదేశ్ సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చిన 35 అడుగుల చనిపోయిన తిమింగలం