Tammrind Effect: చింతపండు అనగానే ఒక్కసారిగా నోరూరిపోతుంది. తియ్యగా, పుల్లగా ఉండి అందరినీ ఊరిస్తుంది. చింత చెట్టు వేర్లు, బెరడు, ఆకులు, పండ్లు, పువ్వులతో సహా దాదాపు అన్నీ ఆరోగ్య ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ వంటకాల్లో చింతపండును ఏదో ఒక రూపంలో వాడుతుంటారు. చింతపండులో ఖనిజాలు, ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి. చింతపండు మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల చికిత్సకు సహాయపడుతుంది. అయితే, ఇది మోతాదు దాటితే చాలా అనర్థాలకు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
చింతపండు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉండటంతో.. మధుమేహం కోసం మందులు వాడేవారు చింతపండును తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. చింతపండును అధిక మొత్తంలో తరచుగా తీసుకోవడం వల్ల పిత్తాశయ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. చింతపండు రక్తపోటును తగ్గిస్తుందని అంటారు. రక్తపోటు కోసం మందులు వాడుతున్నట్లైతే, చింతపండు వాడకాన్ని తగ్గించడం మంచిది. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుందట. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: