Baby Corn Masala Snacks: రోజూ ఒకే రకమైన ఆహారం తినాలంటే ఎవరికైనా బోర్ కొడుతోంది. డిఫరెంట్ రుచుల కోసం ఆరాటపడతాం.. కొంతమంది రెస్టారెంట్స్ కు వెళ్ళితే.. మరికొందరు.. ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేస్తారు. తాజాగా బరువు తగ్గడానికి డైటింగ్ చేసేవారి కోసం డాక్టర్ చెప్పిన రుచి కరమైన బేబీకార్న్ మిక్సిడ్ వెజిటబుల్ స్నాక్స్ ను తయారీ విధానం ఈరోజు తెలుసుకుందాం..
బెల్ పెప్పర్ మూడు కలర్స్
పనీర్,
బేబీ కార్న్,
ముష్రూమ్స్
బట్టర్
ఆనియన్స్
టమాటో
అల్లం ముక్కలు,
వెల్లులి ముక్కలు
మసాలా పొడి
సోయా సాస్
బేబీకార్న్
కూరగాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి.. దానిలో కొంచెం బట్టర్ వేసి, పనీర్ గోల్డెన్ బ్రౌన్ లోకి వేయించాలి. మళ్ళీ కొంచెం బట్టర్ వేసి, బెల్ పెప్పర్, ఆనియన్స్, ముష్రూమ్స్ ,బేబీ కార్న్ అన్ని కలిపి సిమ్ లో వేయించుకోవాలి. ,హాఫ్ కుక్ అయ్యాక దించేయాలి. మళ్ళీ కొంచెం బట్టర్ వేసి టమాటో అల్లం ముక్కలు,వెల్లులి ముక్కలు వేసి,అందులో కొద్దిగా మసాలా పొడి వేసి,మగ్గించాలి.. తర్వాత అందులో కొంచెం సోయా సాస్ వేసి పనీర్, మిగతా కూరగాయ ముక్కలు వేసి కలిపి.. మగ్గించాలి. అనంతరం దానిలో కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ వెయ్యాలి. అంతే ఏంతో రుచికరమైన స్వీట్ కార్న్ మిక్సిడ్ వెజిటబుల్ స్నాక్స్ రెడీ.. దీనిని వేడి వేడిగా తింటే మంచి రుచికరంగా ఉంటుంది.
Also Read: మన శరీరంలో ముఖ్యమైన అవయవం కాలేయం.. దీనిని శుభ్రం చేసి.. ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాలు ఏమిటంటే..!