Brinjal Benefits: కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే ఇకపై తొక్క కూడా వదిలిపెట్టరు..!

|

Jun 17, 2024 | 7:23 PM

వంకాయ వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

Brinjal Benefits: కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే ఇకపై తొక్క కూడా వదిలిపెట్టరు..!
Brinjal
Follow us on

కర్రీ, ఫ్రై, పులుసు, బజ్జీ..ఇలా అనేక రకాలుగా వండుకుని తింటారు. వంకాయను అనేక రకాలుగా వండుకోవచ్చు. వంకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వంకాయలో జీర్ణక్రియను మెరుగు పరిచే గుణం ఉంది. కెలరీలను కరిగించే శక్తి కూడా వంకాయకు ఉంది. అంతేకాదు, వంకాయతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్త
ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6 మాత్రమే కాదూ వంకాయలో బీటా కేరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నియంత్రించగలదు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

వంకాయలో కెరోటినాయిడ్స్ అనే పోషకాలు ఉన్నాయి. ఈ కెటినాయిడ్స్ విటమిన్ ఏ లోపాన్ని కంట్రోల్ చేస్తుంది. వంకాయ తినడం వల్ల విటమిన్ ఏ మనకు సరిపడా లభిస్తుంది. విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగుపడుతుంది. బాడీలో ఉన్న కొవ్వును తగ్గించడం లో కూడా వంకాయలు చాల కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త తీసుకోవాలి. వంకాయ కూర వండేప్పుడు నూనె తక్కువ ఉపయోగించాలి అనేది వైద్యుల సూచన.

వంకాయ వండేటప్పుడు ఎక్కువ ఆయిల్ వాడితే ఇందులో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి. . వీటితో పాటు వంకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాల వరకు ఉండదు అని వైద్య నిపుణుల మాట. వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్దాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..