Poppy Seeds Curry: ఇప్పుడంటే చిన్నదైనా పెద్దదైనా రోగం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్తున్నాం కానీ.. పూర్వకాలంలో జ్వరం. విరోచనాలు, జలుబు వంటివి వంటి.. వంటింటి చిట్కాలు.. వ్యాధికి అనుగుణంగా చేసే వంటలే మందులు.. ఎవరైనా బాగా మోషన్స్ అని బాధపడితే గసగసాల కూర వండి పెట్టండి.. వెంటనే మోషన్స్ తగ్గుతాయి. ఈరోజు గసగసాల కూర తయారీ చూద్దాం.
గసగసాలు
ఎండు మిర్చి
జీలకర్ర
ఉప్పు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కరివేపాకు
ఉప్పు
నూనె
తాలింపు గింజలు
ముందుగా గసగసాలు నీటిలో నానబెట్టాలి.. అలా ఓ అరగంట నానబెట్టిన తర్వాత వాటిని వడగట్టి ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. కొద్దిగా నీరు చేరుస్తూ మెత్తగా మిక్సీ పట్టండి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకోండి.
తర్వాత బాణలిలో సరిపడా నూనె వేసి తాలింపు వేసి వేగాక తరుగుకున్న ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి,కరివేపాకు వేసి వేగనివ్వండి. తర్వాత గసాల ముద్ద వేసి కలిపి కాసేపు మూత పెట్టి ఉంచి , కొద్దిగా నీరు చేర్చి కలియబెడుతూ నూనె పైకి తేలాక దింపుకొని వేడి వేడిగా తింటే మోషన్స్ తగ్గుతాయి.
Also Read: ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ నోటిఫికేషన్ .. అర్హులు ఎవరంటే