
తక్కువ సమయం.. తక్కువ పదార్థాలు.. కానీ అద్భుతమైన రుచి! పంజాబీ స్టైల్ ఆలూ బెండకాయ ఫ్రై ఇంట్లోనే హోటల్ రుచితో రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. బెండకాయ జిగురు రాకుండా, బంగాళదుంపలు మెత్తబడకుండా పర్ఫెక్ట్‌గా వేగాలంటే ఏం చేయాలో ప్రముఖ ఫుడ్ ఎక్స్‌పర్ట్ స్వాతి అందించిన ఈ స్పెషల్ రెసిపీ మీకోసం. సాధారణంగా బెండకాయ వండేటప్పుడు జిగురు రావడం పెద్ద సమస్య. అయితే బంగాళదుంపలతో కలిపి చేసే ఈ మసాలా వేపుడులో కొన్ని మెళకువలు పాటిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
బెండకాయలు (అర కిలో)
బంగాళదుంపలు (3 మీడియం సైజ్)
టమోటాలు (2 చిన్నవి – ప్యూరీ కోసం)
అల్లం/వెల్లుల్లి ముక్కలు
కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు
ఆయిల్, కసూరీ మేతీ
తయారీ విధానం:
బెండకాయలను కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. తడి ఉంటే జిగురు వస్తుంది. బంగాళదుంపలను ముక్కలుగా కోసి నీటిలో వేయాలి (దీనివల్ల స్టార్చ్ పోయి ముక్కలు అతుక్కోవు).
బాణలిలో నూనె వేసి ముందుగా బంగాళదుంప ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే నూనెలో వెల్లుల్లి, బెండకాయ ముక్కలు వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. జిగురు పూర్తిగా పోయే వరకు వేయించడం ముఖ్యం.
బెండకాయ వేగాక, అందులో ముందుగా వేయించిన ఆలూ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు మరియు గరం మసాలా వేసి 2 నిమిషాలు కలపాలి.
మధ్యలో కొంచెం ఖాళీ చేసి టమోటా ప్యూరీ వేసి, పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. చివరగా కసూరీ మేతీ చల్లితే మంచి సువాసన వస్తుంది.
బెండకాయ ముక్కలను మరీ చిన్నగా కోయవద్దు, దీనివల్ల జిగురు ఎక్కువవుతుంది.
టమోటా ముక్కల కంటే ప్యూరీ వేయడం వల్ల వంటకం త్వరగా పూర్తి అవుతుంది ముక్కలు మెత్తబడవు.
జిగురు పోయే వరకు టమోటాలు లేదా ఉప్పు వేయకండి.