Pav Bhaji Recipe: ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ.. సింపుల్ చిట్కాలతో పర్ఫెక్ట్ గా చేసేయండిలా

సాయంత్రం వేళ వేడివేడి పావ్ భాజీ తింటుంటే ఆ మజాయే వేరు. మెత్తని బన్, వెన్నతో మెరిసిపోయే ఘాటైన భాజీ.. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ! అయితే మనం ఇంట్లో చేసినప్పుడు హోటల్ రుచి రావడం లేదని చాలామంది బాధపడుతుంటారు. కానీ, ఆ హోటల్ స్టైల్ టెక్స్చర్ టేస్ట్ రావడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే, మీరు కూడా ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ పావ్ భాజీని నిమిషాల్లో సిద్ధం చేయవచ్చు.

Pav Bhaji Recipe: ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ.. సింపుల్ చిట్కాలతో పర్ఫెక్ట్ గా చేసేయండిలా
Pav Bhaji A Delicious Street Food Recipe

Updated on: Jan 21, 2026 | 3:49 PM

పావ్ భాజీ అంటే అన్ని రుచులు కలగలిసిన ఒక అద్భుతం. వీధి పక్కన బండి మీద దొరికే పావ్ భాజీకి ఉండే ఆ ప్రత్యేకమైన వాసన వెనుక కొన్ని వంట రహస్యాలు దాగి ఉన్నాయి. కూరగాయలు ఉడికించే పద్ధతి నుండి, బన్నును వేయించే విధానం వరకు ప్రతిదీ చాలా కీలకం. ముంబై స్ట్రీట్ స్టైల్ రుచిని మీ వంటింట్లోకి తీసుకువచ్చే ఆ ‘మ్యాజిక్’ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

బంగాళాదుంపలు – 4

కాలీఫ్లవర్ – 1 కప్పు

పచ్చి బఠానీలు – ½ కప్పు

క్యారెట్ – 1

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

టమోటాలు – 3 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 2

అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్

పావ్ భాజీ మసాలా – 2.5 టీస్పూన్లు

మిరప పొడి – 1 టీస్పూన్

పసుపు పొడి – ¼ టీస్పూన్

వెన్న (Butter) – 3-4 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు – తగినంత

పావ్ బన్స్ – అవసరమైనన్ని

తయారీ విధానం

ముందుగా ఒక పాన్ లో వెన్న వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అందులోనే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కారం, పావ్ భాజీ మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి. వేరుగా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసిన కూరగాయల మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు పోసి మీడియం మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించి, చివరగా వెన్న, నిమ్మరసం మరియు కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి భాజీ సిద్ధం.

హోటల్ రుచి రహస్యాలు

హోటళ్లలో రుచి రావడానికి మొదటి రహస్యం కూరగాయల నిష్పత్తి. వారు బంగాళాదుంపలు 50%, కాలీఫ్లవర్ 25%, బఠానీలు 15%, క్యారెట్లు 10% తీసుకుంటారు. అన్నింటినీ విడివిడిగా ఉడికించి, ఎక్కడా ముక్కలు లేకుండా స్మూత్‌గా మ్యాష్ చేస్తారు. రెండోది ‘వెన్న’. నూనెకు బదులుగా స్వచ్ఛమైన వెన్నను అధికంగా వాడటం వల్లే ఆ మెరుపు వాసన వస్తాయి. టమోటాలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు, వెన్న వేస్తే అవి త్వరగా మెత్తబడి మసాలాతో బాగా కలుస్తాయి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హోటళ్లలో భాజీని నిరంతరం తక్కువ మంట మీద ఉడికిస్తూనే ఉంటారు. దీనివల్ల మసాలాలు కూరగాయలకు బాగా పట్టి రుచి పెరుగుతుంది. వారు కూరను కలపడానికి ఫ్లాట్ లాడిల్‌ను వాడుతూ నిరంతరం మ్యాష్ చేస్తారు. ఇక బన్నును వేయించేటప్పుడు కేవలం వెన్న మాత్రమే కాకుండా, కొంచెం పావ్ భాజీ మసాలా కొత్తిమీర చల్లి వేయిస్తే అది ‘5-స్టార్’ లుక్ టేస్ట్‌ను ఇస్తుంది. స్టవ్ ఆపివేసిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలపాలి, అప్పుడే ఆ తాజా రుచి పోకుండా ఉంటుంది.