Papaya Health Benefits: అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని బొప్పాయి..

|

Apr 10, 2021 | 1:23 PM

Papaya Health Benefits:బొప్పాయి 400 ఏళ్ల క్రితమే మనదేశంలో అడుగు పెట్టింది. ఈ బొప్పాయి పండులో ఉండే పోషకాలు మరే పండులోనూ లేవంటారు పోషకాహార నిపుణులు...

Papaya Health Benefits: అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల గని బొప్పాయి..
Papaya Benefits
Follow us on

Papaya Health Benefits:బొప్పాయి 400 ఏళ్ల క్రితమే మనదేశంలో అడుగు పెట్టింది. ఈ బొప్పాయి పండులో ఉండే పోషకాలు మరే పండులోనూ లేవంటారు పోషకాహార నిపుణులు. ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుంది ఈ బొప్పాయి. అయితే కొంతమంది బొప్పాయి పండు తింటే వేడి చేస్తుంది అంటూ.. దూరం పెట్టేస్తారు.. కానీ ఈ పండులో ఉన్న ఔషధగుణాల గురించి తెలిసిస్తే.. తినడం మానరు.. అంటున్నారు. ఈ బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్స్‌, పొటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి అనేక పోషకాలున్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇక రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఎక్కువ. ప్రస్తుతం కరోనా వైరస్ నిరోధకంగా బొప్పాయి పనిచేస్తుందని.. ఎంత వీలయితే అంత ఎక్కువగా తినడానికి ప్రయత్నించామని నిపుణులు సూచిస్తున్నారు. ఇక భోజనం తర్వాత బొప్పాయి తింటే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాల్ని తొలగిస్తుంది. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాలి. ఫలితంగా ప్లేట్ లెట్స్ మళ్లీ వేగంగా పెరుగుతాయి.
బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కనుక ఈ పండు ఎక్కువగా తిన్నా బరువు పెరగరు. అందుకని స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ తోడ్పడుతుంది. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా చేస్తుంది.మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారికి బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. బొప్పాయిలో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌ వైరస్‌తో పోరాడతాయి. ఇది కొలన్‌, గర్భాశయ కాన్సర్‌లను తగ్గిస్తుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటం,రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అర్శమొలలు రాకుండా కాపాడుతుంది. ఆస్తమా మరియు కీళ్లనొప్పులు తగ్గిస్తుంది.

బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా… ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపు రావడంతో పాటు మొటిమలూ తగ్గుతాయి. బొప్పాయి ఫేస్‌ప్యాక్‌ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. ఎన్నో ప్రయోజనాలున్న బొప్పాయిని కొన్ని రకరాల మెడిసిన్స్ తయారీలో కూడా వాడుతున్నారు. ముఖ్యంగా బొప్పాయిలో ఉండే పెప్పీన్ అనేప్రదార్థం జీర్ణక్రియకు సంబంధించిన మందులు తయారు చేయటంలో వాడుతున్నారు.

Also Read: ఇంట్లోనే రెస్టారెంట్ టెస్ట్ తో పన్నీర్ టిక్కా మసాలా తయారీ చేసుకోవడం ఎలా అంటే..!