Panasapottu Curry: పనసపొట్టు కూర గోదావరి జిల్లా వాసులకు అత్యంత ప్రియమైంది. ఇక మిథునం మూవీలో ప్రత్యేకం గా పనసపొట్టు కూర గురించి బాలు అద్భుతం గా వర్ణించడంతో చాలా మందికి పనసపొట్టు కూర స్పెషాలిటీ ఏమిటో తెలుసుకోవాలని.. ఒక్కసారైనా రుచి చూడాలని భావించినవారు ఎందరో.. ఈ రోజు కోనసీమ స్పెషల్ పనసకాయ ఆవపెట్టినకూర తయారీ గురించి తెలుసుకుందాం..రైస్ తో చేసే పులిహార ఎంత టేస్టీగా ఉంటుందో పనసపొట్టుతో చేసే ఈకూర అంత టేస్టీగా ఉంటుంది..
పనసపొట్టు
జీడిపప్పు
వేరుశనగలు
ఆవాలు
పచ్చిమిర్చి
మినపపప్పు
శనగపప్పు
కర్వేపాకు
చింతపండు
అల్లం
ఎండుమిర్చి
ఇంగువ
ముందుగా చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత పనసపొట్టుని మందంగా ఉండే ఒక గిన్నెలో వేసి కొద్దిగా పసుపువేసి ఉడికించాలి. మరి మెత్తగాకాకుండా పొట్టు విడివిడిగా ఉండేలా ఉడికించుకోవాలి.
స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేడి అయ్యాక అందులో వేరుశనగ గుళ్ళు, తర్వాత జీడీ పప్పు వేయించి అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు , చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేయించుకోవాలి. తరువాత ఎండుమిరపకాయ ముక్కలు , ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు,ఒకస్పూన్ మినప్పప్పు,ఒకస్పూన్ ఆవాలు,ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇష్టమైన వారు ఇంగువ కూడా వేసుకుని వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి..అఖరున చింతపండు పులుసు కూడా వేసి..ఒక రెండునిమిషాలు ఉడికించాలి. అలా ఉడుకుతున్న సమయంలో ఉడికించిన పనసపొట్టులో నీరుని తీసి ఆ బాణలిలో వేసి బాగా వేయించాలి.
ఈలోపల పనసపొట్టు కూర స్టవ్ మీద ఉండగానే మూడు స్పూన్ల ఆవాలు,కొద్దిగా(చిటికెడు) సాల్ట్ ఒక ఎండుమిర్చి మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసి పేస్ట్ చేసుకోవాలి..ఇప్పుడు స్టవ్ మీద కూర ని కట్టేసి ఈ ఆవాలు పేస్ట్ ఆ పనసపొట్టుకూర లో వేసి మొత్తం కూర అంతా కలిసేటట్టు కలపాలి..ఆంతే ఎంతో రుచికరమైన కోనసీమ స్పెషల్ ఆవపెట్టిన పనసపొట్టుకూర రెడీ.
Also Read: నిద్రలేమి సమస్య, కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి…