
ఓట్స్ (Oats).. ఆరోగ్యానికి మంచివి.. ఫైబర్ అధికంగా ఉండటంతో సులభంగా జీర్ణమవుతుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఓట్స్‌లో అధిక ఫైబర్, ప్రోటీన్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.. ఇంకా ఆకలిని నియంత్రిస్తాయి. ఇవి తక్కువ కేలరీలు కలిగి ఉండి, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతుంది. అందుకే.. చాలా పోషకాలు ఉన్న ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని పేర్కొంటారు. ఓట్స్ మన సంప్రదాయ అటుకుల వలె, ధాన్యాల నుండి సిద్ధం చేసిన ఒక రకమైన ఆహారం. ఓట్స్ ను చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు.. లేదా పొట్ట సరిగా లేనివారు ఓట్స్‌ను వినియోగించవచ్చు.
ఓట్స్ వల్ల కలిగే లాభాలు.. వాటిని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా బలమైన టిఫిన్‌ల బదులుగా, పాలల్లో ఓట్స్ వేసి తేనె లేదా ఖర్జూరం పొడితో తీసుకుంటే.. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీచు పదార్థాలు లభిస్తాయి. ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, చక్కటి బలాన్ని, పోషకాలను అందించి, గట్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. పొట్ట గడబిడిగా ఉన్నప్పుడు, గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్యలు వచ్చినప్పుడు, లేదా జ్వరం తర్వాత కోలుకునే సమయంలో ఓట్స్‌ను అన్నంగా వండుకుని మధ్యాహ్నం కూడా తినవచ్చు. ఇది చాలా మెత్తగా ఉండి, నోటిలో కరిగిపోయి, కడుపుకు సుఖాన్ని ఇస్తుంది.
మొలకెత్తిన విత్తనాలు, పండ్లు వంటి సహజమైన ఆహారాలతో ఓట్స్ ను నిత్యం తీసుకోవచ్చు.. ఉదయం, మధ్యాహ్నం.. ఇంకా చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు, ప్రయాణాల్లో బయట ఆహారం తినకూడదనుకున్నప్పుడు, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగా లేనప్పుడు ఓట్స్‌ను పాలలో కలుపుకుని తీసుకోవచ్చు. అయితే.. ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు..
నీరు లేదా పాలు (తక్కువ కొవ్వు) తో తయారు చేసిన ఓట్స్ తక్కువ కేలరీల ఆరోగ్యకరమైన అల్పాహారం అని పేర్కొంటున్నారు. అయితే.. రోల్డ్ ఓట్స్ లేదా స్టీల్-కట్ ఓట్స్ ఆరోగ్యానికి ఉత్తమమైనవి.. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి.. వీటికి చక్కెర, క్రీమ్, చాక్లెట్ చిప్స్ వంటి అధిక కేలరీల పదార్థాలను జోడించవద్దు.. వాటికి బదులుగా పండ్లు, నట్స్, గింజలు (seeds) జోడించడం మంచిది. లేకపోతే బరువు తగ్గే బదులు అలానే ఉంటుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..