
సాధారణంగా ఉదయపు అల్పాహారంలో వేడివేడిగా ఉబ్బిన పూరీలు ఉంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. అయితే పూరీలను నూనెలో బాగా వేయించడం వల్ల అందులో క్యాలరీలు, చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, డయాబెటిస్ బాధితులు పూరీలకు దూరంగా ఉంటారు. కానీ, అస్సలు నూనె వాడకుండా ప్రెషర్ కుక్కర్ సహాయంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పూరీలు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ వినూత్న పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.
ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు, తగినంత నీరు పోసి సాధారణంగా పూరీలకు కలిపినట్లే కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ కర్రతో సన్నని పూరీల్లా ఒత్తుకోవాలి. ప్రెషర్ కుక్కర్‌లో అడుగు భాగంలో కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. దానిపైన ఆవిరి మీద ఉడికే చిల్లుల పళ్ళెం లేదా ఇడ్లీ పాత్ర ఉంచాలి. లేదంటే, ఒక ప్లేట్ కు నూనె రాసి కూడా పెట్టొచ్చు. పూరీలు అంటుకోకుండా ఉండటానికి. పూరీలను ఈ ప్లేట్ పై ఉంచి కుక్కర్ లోని స్టాండ్ పై ఈ ప్లేట్ ఉంచండి. తరువాత కుక్కర్ మూత మూసివేసి విజిల్ తీయండి. తరువాత 3 నుండి 5 నిమిషాలు ఉడికించాలి. ఆవిరి పూరీలు సరిగ్గా ఉబ్బి ఉడికిపోతాయి. కుక్కర్‌లోని వేడి ఆవిరి వల్ల పూరీలు నూనెలో వేగనప్పటికీ చాలా త్వరగా, మెత్తగా ఉబ్బుతాయి. కొద్ది నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన ఆవిరి పూరీలు రెడీ.
నూనెలో వేయించకపోవడం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవు. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉండదు. నూనె లేకపోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగకుండా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవిరి మీద ఉడికిన ఆహారం త్వరగా అరుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. సాంప్రదాయ రుచిని కోల్పోకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునే వారికి ఈ నూనె లేని కుక్కర్ పూరీ రెసిపీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..