Mulakkada Avakaya : దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ములక్కాయ, ఆకులు కూడా వంటల్లో ప్రధాన పాత్రను పోషిస్థాయి. ఇక ములక్కాయ తో సాంబార్ తో పాటు అనేకాలైన కూరలు చేస్తారు.. అయితే ఈరోజు మనం ములక్కాయతో నిల్వ పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు.. ఈరోజు ములక్కాయ మెంతి ఆవకాయ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం..!
మునక్కాడలు – 6
నూనె – సరిపడా
చింతపండు – పెద్ద నిమ్మకాయంత
కారం – 75 గ్రాములు.
మెంతులు – మూడు స్పూన్లు
ఆవాలు – మూడు స్పూన్లు
పసుపు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఎండుమిరపకాయలు- 6
ఆవాలు
ఇంగువ
ముందుగా మునక్కాడలు అంగుళంన్నర ముక్కలుగా తరుగు కోవాలి . అనంతరం వాటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టాలి. అనంతరం పైన పీచు తీసేసు కోవాలి. ఇక చింతపండును విడదీసుకుని గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి .
తర్వాత బాణలి స్టౌ మీద పెట్టి.. మెంతులను, ఆవాలను నూనె వేయకుండా వేయించాలి.. కమ్మటి వాసన వసిసిన తర్వాత వాటిని ఒక పళ్ళెములో తీసుకుని బాగా చల్లార నివ్వాలి.
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకుని నూనెను బాగా కాగ నివ్వాలి. తర్వాత మునక్కాయ ముక్కలను నూనెలో వేసుకుని రెండు నిముషాలు మునక్కాయలను మగ్గనివ్వాలి. వెంటనే స్టౌ ఆపేయాలి. మూత పెట్టకూడదు.
కొద్దిగా ముక్కలను చల్లార నివ్వాలి. వేయించిన మెంతులు, ఆవాలు మిక్సీ లో వేసుకుని మెత్తని పొడిగా వేసుకోవాలి. తర్వాత విడదీసిన చింతపండును కూడా ఆవాలు మెంతుల పొడిలో వేసుకుని మెత్తని పొడిగా మిక్సీ వేసుకోవాలి.
ఒక బేసిన్ లో ముందుగా కారము , పసుపు , మెంతిపిండి , ఆవపిండి మరియు చింతపండు వేసిన మిశ్రమము మరియు మెత్తని ఉప్పు వేసుకుని ఆవకాయకు కలిపిన మాదిరిగా చేతితో బాగా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని బాండిలో వేగిన ములక్కాడలు నూనెతో బేసిన్ లో వేసుకుని చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే ఒక ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ వేసి పోపు బాగా చల్లారాక మునక్కాడ ఆవకాయలో కలిపి ఓ మూడు గంటల పాటు పిండి ముక్కలకు పట్టే విధముగా కదపకుండా ఉంచాలి. తర్వాత జాడీలోకి తీసుకొని ఒక రోజంతా కదపకుండా ఉంచాలి . అప్పుడు పిండి ముక్కలకు పట్టి మునక్కాడలు చాలా రుచిగా ఉంటాయి. మూడవ రోజు నుంచి ములక్కాయ మెంతి ఆవకాయ తినడానికి రెడీ అవుతుంది. మూడు నెలలు నిల్వ ఉంటుంది. ఈ మెంతి మునగావకాయ భోజనము లోకి మరియు చపాతీల లోకి కూడా రుచిగా ఉంటుంది.
Also Read:: రోజురోజుకీ దిగివస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు పసిడిపై పెట్టుబడులు పెట్టవచ్చా..?