Moong Dal Benefits: పెసర పప్పుతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు

|

Apr 25, 2022 | 12:21 PM

Pesara Pappu Benefits: అన్ని రకాల పప్పు దినుసులు తినాలని వైద్యులు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే.. పప్పుల్లో మాంసక‌ృత్తులు అధికంగా ఉంటాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

Moong Dal Benefits: పెసర పప్పుతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు
Moong Dal
Follow us on

Pesara Pappu Benefits: అన్ని రకాల పప్పు దినుసులు తినాలని వైద్యులు ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. ఎందుకంటే.. పప్పుల్లో మాంసక‌ృత్తులు అధికంగా ఉంటాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే పప్పు దినుసుల్లో పెసర పప్పు కూడా ఒకటి. దీని వల్ల మన శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. పెసర పప్పులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్-బి6, నియాసిన్, ఫోలేట్ ఉంటాయి. దీంతోపాటు పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు (weight loss) పెరగడాన్ని నియంత్రించడంతోపాటు తగ్గవచ్చు. అంతేకాకుండా గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. పెసరపప్పు తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

పెసర పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

  • రోగనిరోధక శక్తి: పెసర పప్పు తీసుకోవడం ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి మొదలైన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు ఒత్తిడికి గురైనట్లయితే ప్రతిరోజూ మీ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పెసర పప్పు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరం రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. ఎప్పుడైతే మీకు బాడీ వీక్ గా అనిపిస్తుందో అప్పుడు మీరు తప్పనిసరిగా పెసర పప్పు తినాలని సూచిస్తున్నారు.
  • జీర్ణవ్యవస్థ: జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పెసర పప్పు తీసుకోవడం మంచిది. పెసర పప్పులో ఫైబర్ తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని తినడం ద్వారా శరీర జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. వేసవి కాలంలో దీనిని తీసుకోవడం ద్వారా కడుపు వేడిని నివారించవచ్చు. అందుకే పెసర పప్పును రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి.
  • డయాబెటీస్: డయాబెటీస్ సమస్య ఉన్నట్లయితే.. పెసర పప్పును తింటే నియంత్రణలోకి వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పోషకలాలు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే.. డాక్టర్ సలహా ఆధారంగా దీనిని తీసుకోవాలి.
  • బరువు: బరువును అదుపులో ఉంచుకోవడానికి పెసర పప్పు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెసర పప్పులో ఉండే తక్కువ క్యాలరీలు బరువును అదుపులో ఉంచుతాయి. ఆకలిని నియంత్రించే ఫైబర్ కూడా ఇందులో తగినంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా, మీకు పదే పదే ఆకలి అనిపించదు. దీంతో బరువు క్రమంగా తగ్గుతారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Also Read:

Moringa Leaf Benefits: మునగ ఆకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Kidney Cancer: ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా కిడ్నీలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం.. జాగ్రత్త!