అవన్నీ జుజుబీ.. దీన్ని మించిన ఫుడ్ మరేది లేదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కి టేస్ట్..

సాయంత్రం టీతో పాటు వేడివేడిగా, కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే మెంతికూరతో చేసే ఈ **క్రిస్పీ మెంతి పకోడీ** తప్పక ట్రై చేయండి. శనగపిండి, వరిపిండి, మెంతికూర, ఉల్లిపాయలతో సులభంగా తయారు చేసుకునే ఈ పకోడీ రుచిలో అదిరిపోతుంది. ఇంట్లోనే కరకరలాడే మెంతి పకోడీని ఎలా తయారు చేయాలో పూర్తి రెసిపీ ఇదిగో..

అవన్నీ జుజుబీ.. దీన్ని మించిన ఫుడ్ మరేది లేదు.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కి టేస్ట్..
Menthi Kura Pakodi

Updated on: Aug 11, 2026 | 5:10 PM

సాయంత్రం వేళల్లో టీతోపాటు.. వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది.. క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆహార పదార్థాలను చాలా మంది ఇష్టపడతారు. అయితే.. అలాంటి బెస్ట్ స్నాక్స్‌లో మెంతి కూర పకోడీ ఒకటి.. రుచికరమైన, కరకరలాడే మెంతి కూర పకోడీని మంచిగా తయారు చేస్తే.. వద్దనే వాళ్లు కూడా ఒకటికి రెండు ప్లేట్లు తింటారు. వాస్తవానికి మెంతికూర పకోడీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి కూర పకోడీ రుచికరంగా ఉండటమే కాకుండా, మెంతికూరలోని విటమిన్లు, ఖనిజాల వల్ల శరీరానికి కొంత మేలు చేస్తుంది. అయితే ఇది నూనెలో వేయించిన స్నాక్ కనుక, బరువు తగ్గాలనుకునే వారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పరిమితంగా తినడం మంచిది.

మెంతి ఆకుతో కరకరలాడే గట్టి పకోడీ (Methi Pakoda Recipe) తయారీ విధానం..

సాయంత్రం పూట వేడివేడిగా, కరకరలాడే స్నాక్స్ తినాలనిపిస్తే మెంతికూరతో చేసే ఈ గట్టి పకోడీ ఒక అద్భుతమైన ఎంపిక. ఉల్లిపాయలు, శనగపిండితో కలిపి వేయించినప్పుడు దీని రుచి అద్భుతంగా మారుతుంది.

కావలసిన పదార్థాలు:

  • శనగపిండి (Besan): 1 కప్పు
  • వరిపిండి (Rice flour): 1/4 కప్పు
  • మెంతి ఆకులు (Methi leaves): 2 కట్టలు (శుభ్రంగా కడిగినవి)
  • ఉల్లిపాయలు: 4 (సన్నగా నిలువుగా తరిగినవి)
  • అల్లం – పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర: 1/4 టీస్పూన్
  • పసుపు: 1/4 టీస్పూన్
  • వంట సోడా (Baking soda): చిటికెడు
  • ఉప్పు: రుచికి తగినంత
  • నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

పిండి మిశ్రమం తయారీ:

ఒక పాత్రలో శనగపిండి.. వరిపిండి వేసుకోవాలి. అందులో కడిగి పెట్టుకున్న మెంతి ఆకులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, పసుపు, చిటికెడు వంట సోడా, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.

కలుపుకోవడం:

నీళ్ళు పోయకుండా మొదట ఈ మిశ్రమాన్ని చేతితో బాగా పిసుకుతూ కలపాలి.. ఉల్లిపాయలు, మెంతి ఆకులలోని తడి వల్ల పిండి బాగా పట్టుకుంటుంది. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించి గట్టిగా పకోడీ పిండిలా కలుపుకోవాలి.

ఫ్రై చేయడం:

పాన్ లో నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల రూపంలో నూనెలో వేయాలి.

స్టవ్ ను మీడియం నుండి హై ఫ్లేమ్ లో ఉంచి, పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు, కరకరలాడే వరకు వేయించుకోవాలి.

బాగా వేగిన పకోడీలను నూనె నుండి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.. అంతే.. వేడివేడిగా కరకరలాడే మెంతి పకోడీ సిద్ధమవుతుంది.సాయంత్రం టీ టైమ్ లో ఈ వేడి పకోడీలను సాస్ తో లేదా.. సాధారణంగా కూడా ఆస్వాదిస్తూ తినొచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us