Summer Tips: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఎందుకు మంచిది.. తెలిస్తే షాక్ అవుతారు..

|

Mar 03, 2022 | 9:21 AM

సూర్యారావు పీల్చి పిప్పి చేసేందుకు రెడీ అవుతున్నాడు. చల్ల చల్లని చలికాలం కాస్తా ఎగిరిపోయింది. మార్చులోనే మండుటెండలు మొదలు కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్తా చల్లగా..

Summer Tips: వేసవిలో పెరుగు కంటే మజ్జిగ ఎందుకు మంచిది.. తెలిస్తే షాక్ అవుతారు..
Curd Vs Buttermilk
Follow us on

సూర్యారావు పీల్చి పిప్పి చేసేందుకు రెడీ అవుతున్నాడు. చల్ల చల్లని చలికాలం(Winter Season) కాస్తా ఎగిరిపోయింది. మార్చులోనే మండుటెండలు మొదలు కాబోతున్నాయి. ఇలాంటి సమయంలో కాస్తా చల్లగా మజ్జిగ(Buttermilk) తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఒంటికి చలువ కోసం భారతదేశంలోని(India) ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగను విరివిగా వాడుతుంటారు. పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అరుగుదల మెరుగుపడుతుందని రోజులో ఒక్కసారైనా పెరుగు తింటారు. అయితే పెరుగు, మజ్జిగ.. ఈ రెండింటిలో శరీరానికి ఏది మంచిది.? ఇప్పటికీ ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. పెద్దలు అయితే.. పెరుగు పెరుగే.. మజ్జిగ మజ్జిగే అంటారు. అయితే పెరుగు కంటే మజ్జిగతో ఎక్కువ లాభాలు పొందొచ్చు. గ్లాసుడు మజ్జిగ మన శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తుంది. రిలీఫ్‌ను ఇస్తుంది. ఎక్కువ మసాలు ఉండే ఫుడ్ తిన్న తర్వాత మజ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో హాయిగా ఉంటుంది.. అంతేకాదు ఆరోగ్యానికి కూడా అంతకంటే బెటర్‌గా ఉంటుంది. అలాగే కడుపులో బాధ, నొప్పి వంటి సమస్యలతో బాదపడుతున్నవారు పుల్లని మజ్జిగకు దూరంగా ఉండటం మంచిది.

ఇదిలా ఉంటే పెరుగులో ప్రోటీన్స్ అధిక శాతం ఉంటుంది. ప్రోటీన్ లోపం ఉన్నవారు పెరుగును తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. పెరుగు, మజ్జిగ.. రెండింటిలోనూ విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. వీటి మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది.

మజ్జిగ తయారీ..

మీరు సాల్టీ మజ్జిగను ఇష్టపడితే.. దీన్ని ఎలా తయారు చేయవచ్చో ఇక్కడ ఉంది. ఒక కుండలో 2 కప్పుల పెరుగు తీసుకోండి. ¼ కప్పు నీరు, ½ tsp గ్రౌండ్ కాల్చిన జీలకర్ర, ¼ tsp నల్ల మిరియాలు పొడి, 2 tbsp కొత్తిమీర ఆకులు, 4 పుదీనా ఆకులు, రెండు చిటికెడు ఎర్ర కారం పొడి, ఉప్పు రుచి ప్రకారం జోడించండి. ప్రతిదీ బాగా కలపడానికి కవ్వంను ఉపయోగించండి. గ్లాసుల్లో పోసికుని హాయిగా ఆస్వాదించండి.

తీయటి మజ్జిగ తీసుకోవాలని అనిపిస్తే.. ఉప్పుకు బదులుగా చక్కెరను మజ్జిగలో ఉపయోగించండి. పెరుగులో కొంత చక్కెర, మీకు నచ్చిన పండ్లను కలపడం ద్వారా మీరు తీయటి మజ్జిగను కూడా తయారు చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ, మామిడి నుంచి చాక్లెట్, డ్రై ఫ్రూట్ మజ్జిగ వరకు మీకు నచ్చినట్లుగా మజ్జిగను చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ఫైటింగ్ స్టైయిల్ మార్చిన ఉక్రెయిన్ యువత.. రష్యన్‌ దళాలపై పెట్రోల్‌ బాంబులతో దాడి..