Health: ఐరన్ లోపం ఆరోగ్యానికి చాలా డేంజర్.! ఈ 7 జ్యూస్‌లను డైట్‌లో చేర్చండి.. సూపర్ బెనిఫిట్స్..

|

Oct 19, 2021 | 4:07 PM

శరీరానికి ఇతర పోషకాలు మాదిరిగానే ఐరన్ కూడా చాలా అవసరం. ఒకవేళ ఐరన్ లోపం తలెత్తితే శరీరానికి అవసరమయ్యే హిమోగ్లోబిన్ ఉత్పత్తి..

Health: ఐరన్ లోపం ఆరోగ్యానికి చాలా డేంజర్.! ఈ 7 జ్యూస్‌లను డైట్‌లో చేర్చండి.. సూపర్ బెనిఫిట్స్..
Juices
Follow us on

శరీరానికి ఇతర పోషకాలు మాదిరిగానే ఐరన్ కూడా చాలా అవసరం. ఒకవేళ ఐరన్ లోపం తలెత్తితే శరీరానికి అవసరమయ్యే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాస్తా తగ్గుతుంది. దీని కారణంగా రక్తహీనత, జుట్టు రాలడం, నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

ఇదిలా ఉంటే ఐరన్ స్థాయిలను పెంచడానికి మీ డైట్‌లో ఫుడ్ మాత్రమే కాదు పలు రకాల జ్యూస్‌లను కూడా చేర్చండి. విటమిన్-సి అధికంగా ఉండే జ్యూస్‌లు రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడతాయి. ఈ జ్యూస్‌లను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. అవేంటో చూసేద్దాం పదండి..

దోసకాయ, కాలే(ఆకుకూర), పాలకూర రసం:

విటమిన్-సి అధికంగా ఉండే జ్యూస్‌ల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా.. మొదటిగా పాలకూర జ్యూస్‌కు ప్రాధాన్యతను ఇవ్వండి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆకుకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇనుముతో పాటు, ఇందులో విటమిన్ B6, B2, K, E, కెరోటినాయిడ్స్, రాగి వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. దోసకాయ, కాలే, పాలకూర కలిపిన జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఆరెంజ్ జ్యూస్:

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటి. నారింజ జ్యూస్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో సిట్రస్ కూడా ఉన్నందున చర్మానికి చాలా ఉపయోగకరం.

పుచ్చకాయ-దానిమ్మ జ్యూస్:

ఐరన్ లోపాన్ని అధిగమించడంలో భాగంగా పండ్లను జ్యూస్‌ల రూపంలో ఆహారంలోకి చేర్చడం సరైన మార్గం. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కొన్ని పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ, పుదీనా ఆకులను తీసుకొని.. వాటికి తేనె, ఉప్పు, నిమ్మరసం కూడా జోడించి జ్యూస్ చేసుకుని తాగండి.

బీట్‌రూట్‌ జ్యూస్:

బీట్‌రూట్‌లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉప్పు, మిరియాలు కలిపి బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

పైనాపిల్, ఆరెంజ్, పొట్లకాయ జ్యూస్:

పైనాపిల్, ఆరెంజ్, పొట్లకాయతో తయారు చేసిన ఈ జ్యూస్ బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అలాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా. నారింజ, పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది.