Summer Food : రోజూ పుచ్చ‌కాయ తిన‌డం మంచిదేనా..? వీరు దూరంగా ఉంటేనే మంచిది..! వైద్య నిపుణుల సలహా..

పుచ్చకాయ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ పుచ్చకాయలో లైకోపీన్ కూడా ఉంటుంది. ఇది ప్రతిరోజూ లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే వికారం, విరేచనాలు, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పుచ్చకాయను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఇంకా మధుమేహులకు..

Summer Food : రోజూ పుచ్చ‌కాయ తిన‌డం మంచిదేనా..? వీరు దూరంగా ఉంటేనే మంచిది..! వైద్య నిపుణుల సలహా..
Watermelon

Updated on: Apr 10, 2024 | 9:12 AM

పుచ్చకాయ వేసవిలో పుష్కలంగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలోని డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా పుచ్చకాయ పండు తినడం వల్ల శరీరానికి కావల్సిన పీచు, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే, ఆరోగ్యకరమైన గుణాలు పుష్కలంగా ఉన్న పుచ్చకాయను కొందరు తినకూడదని మీకు తెలుసా..? ఎవరికి పుచ్చకాయ తింటే ఎలాంటి హాని కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

లివర్ ఇన్ఫ్లమేషన్:

పుచ్చకాయ తీసుకోవడం వల్ల కాలేయంలో మంట కలుగుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం బలహీనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పుచ్చకాయను తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో లైకోపీన్ ఉండటం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

అలర్జీకి కారణం కావచ్చు :

కొందరికి పుచ్చకాయ తిన్న తర్వాత ఎలర్జీ వస్తుంది. పుచ్చకాయ తింటే వాపు, శ్వాస సమస్య, చర్మ సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో అలెర్జీ ప్రతిచర్య అనాఫిలాక్సిస్‌కు దారితీస్తుంది. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి.

బ్లడ్ షుగర్:

డయాబెటిక్ రోగులు పుచ్చకాయ తినకూడదు. పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పుచ్చకాయను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తినాలి. పుచ్చకాయ జ్యూస్‌ మాత్రం పొరపాటున కూడా తీసుకొవద్దు.

అధిక పోటాషియంతో అనర్థాలు :

పుచ్చకాయ పొటాషియం మంచి మూలం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎన్నో విధాలుగా తోడ్పడుతుంది. ఇది మన శరీరంలో ఎలక్ట్రోలైట్ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. అధిక పొటాషియం హృదయ స్పందన, బలహీనమైన పల్స్ వంటి హృదయ సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణ సమస్య:

పుచ్చకాయ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ పుచ్చకాయలో లైకోపీన్ కూడా ఉంటుంది. ఇది ప్రతిరోజూ లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే వికారం, విరేచనాలు, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి పుచ్చకాయను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us