Onions: ఉల్లిపాయలు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

మార్కెట్ కి వెళ్లినప్పుడు ఉల్లిపాయలు చూడగానే అన్నీ బానే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ఇంటికి తెచ్చాక అవి లోపల నల్లగా ఉండటమో లేదా కుళ్లిపోవడమో చూసి చికాకు వేస్తుంది. ముఖ్యంగా ధరలు పెరిగినప్పుడు ఇలా జరిగితే జేబుకు చిల్లు పడ్డట్టే.. మరి ఎక్కువ రోజులు మన్నే గట్టి ఉల్లిపాయలను ఎలా గుర్తించాలి..? షాపింగ్ చేసేటప్పుడు గమనించాల్సిన ఆ చిన్న చిన్న విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Onions: ఉల్లిపాయలు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
How To Pick Fresh Onions

Updated on: Jan 15, 2026 | 12:55 PM

వంటగదిలో ఉల్లిపాయ లేనిదే ఏ కూర పూర్తి కాదు. అయితే చాలా సార్లు మనం మార్కెట్ నుండి తెచ్చిన రెండు మూడు రోజులకే ఉల్లిపాయలు కుళ్లిపోవడం లేదా మొలకలు రావడం గమనిస్తుంటాం. దీనివల్ల వంటకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆర్థికంగానూ నష్టం వాటిల్లుతుంది. ఉల్లిపాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, వాటిని కొనేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గట్టిదనాన్ని పరీక్షించండి

మంచి ఉల్లిపాయను గుర్తించడానికి మొదటి మార్గం దానిని తాకి చూడటం. ఉల్లిపాయను చేత్తో పట్టుకుని నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఒకవేళ అది మెత్తగా లేదా స్పంజ్ లాగా అనిపిస్తే, అది లోపలి నుండి కుళ్ళిపోవడం ప్రారంభించిందని అర్థం.

పొడి తొక్కే శ్రేష్ఠం

ఉల్లిపాయ తొక్క కాగితంలా పల్చగా, పొడిగా ఉండాలి. ఒకవేళ తొక్క తేమగా ఉన్నా లేదా పైన తడి తగిలినా అది త్వరగా మొలక వచ్చే అవకాశం ఉంది. అలాగే తొక్క మెరుస్తూ, స్పష్టమైన రంగులో ఉండేలా చూసుకోవాలి.

నల్లటి మచ్చలు ఉంటే వద్దు

ఉల్లిపాయ పైన నల్లటి పొడిలాంటి మచ్చలు లేదా బూజు కనిపిస్తే వాటిని అస్సలు కొనకండి. ఇవి శిలీంధ్రాల వల్ల ఏర్పడతాయి. అటువంటి ఉల్లిపాయలను మిగిలిన వాటితో కలిపి ఉంచితే, మంచివి కూడా త్వరగా పాడైపోతాయి.

వాసన చూసి పసిగట్టండి

తాజా ఉల్లిపాయలకు ఎటువంటి వింత వాసన ఉండదు. కానీ, ఒకవేళ ఉల్లిపాయ నుండి ఘాటైన లేదా ఒక రకమైన కుళ్ళిన వాసన వస్తుంటే, అది లోపలి నుండి పాడైందని గుర్తించాలి. ముఖ్యంగా ఉల్లిపాయ పైభాగం దగ్గర వాసన గమనించడం ముఖ్యం.

నిల్వ చేసే పద్ధతి మార్చండి

ఉల్లిపాయలు కొన్న తర్వాత వాటిని ప్లాస్టిక్ కవర్లలోనే ఉంచడం పెద్ద పొరపాటు. ఉల్లిపాయలను ఎప్పుడూ గాలి తగిలే బుట్టల్లో లేదా పొడి ప్రదేశంలో ఉంచాలి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు కలిపి ఉంచకూడదు. ఎందుకంటే బంగాళదుంపలు విడుదల చేసే వాయువుల వల్ల ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తుతాయి.