Chilli Paneer: టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పన్నీర్‌తో ఎలాంటి వంటకాలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా రోటీలు, పుల్కాలతో పన్నీర్ తింటే పర్ ఫెక్ట్‌గా ఉంటుంది. పన్నీర్‌లో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి వారంలో రెండు సార్లు అయినా తినవచ్చు. నాన్ వెజ్ ప్రియులు కూడా పన్నీర్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. శాకాహారులకు బెస్ట్ ఛాయిస్ పన్నీర్. ఇందులో కావల్సినంత ప్రోటీన్, క్యాల్షియం..

Chilli Paneer: టేస్టీ చిల్లీ పన్నీర్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
Chilli Panner
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 9:59 PM

పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పన్నీర్‌తో ఎలాంటి వంటకాలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ముఖ్యంగా రోటీలు, పుల్కాలతో పన్నీర్ తింటే పర్ ఫెక్ట్‌గా ఉంటుంది. పన్నీర్‌లో శరీరానికి అవసరం అయ్యే పోషకాలు అన్నీ ఉంటాయి. కాబట్టి వారంలో రెండు సార్లు అయినా తినవచ్చు. నాన్ వెజ్ ప్రియులు కూడా పన్నీర్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. శాకాహారులకు బెస్ట్ ఛాయిస్ పన్నీర్. ఇందులో కావల్సినంత ప్రోటీన్, క్యాల్షియం లభ్యమవుతాయి. పన్నీర్‌తో చేసే టేస్టీ వంటకాల్లో చీల్లీ పన్నీర్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చిల్లీ పన్నీర్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

చిల్లీ పన్నీర్‌కు కావాల్సిన పదార్థాలు:

పన్నీర్, పచ్చి మిర్చి, క్యాప్సికమ్, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కసూరి మేథి, వెల్లుల్లి రెబ్బలు, పెరుగు, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మరసం.

చిల్లీ పన్నీర్‌ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి పెరుగు, నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేథి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలపండి. ఇలా అరగంట సేపు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి కలపాలి. ఆ తర్వాత చిన్న మంట పెట్టండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేయండి. మాడకుండా ముక్కలు విరగకుండా చూసుకోవాలి. ముక్కలు బాగా ఉడికేంత వరకూ చిన్న మంట మీదనే ఉంచండి. ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే టేస్టీ చిల్లీ పన్నీర్ రెసిపీ సిద్ధం. ఇలా సింపుల్‌గానే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేసి రుచి ఎలా ఉందో చూసేయండి.