Egg Keema Masala: ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..

కీమా అనగానే చాలా మందికి మటన్ కీమానే గుర్తుకు వస్తుంది. కానీ కోడి గుడ్లతో కూడా కీమా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కీమా కర్రీని పులావ్, చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా తినవచ్చు. ఉడకబెట్టిన గుడ్లతో ఈ కీమా తయారు చేస్తారు. ఈ కీమా కర్రీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా కావాలి అనుకుంటే..

Egg Keema Masala: ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
Egg Keema Masala
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 16, 2024 | 10:13 PM

కీమా అనగానే చాలా మందికి మటన్ కీమానే గుర్తుకు వస్తుంది. కానీ కోడి గుడ్లతో కూడా కీమా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కీమా కర్రీని పులావ్, చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా తినవచ్చు. ఉడకబెట్టిన గుడ్లతో ఈ కీమా తయారు చేస్తారు. ఈ కీమా కర్రీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ కీమా మసాలా కర్రీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కోడి గుడ్ల కీమాకి కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, గరం మసాలా, ధనియాల పొడి, నెయ్యి.

కోడి గుడ్ల కీమా తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి తురుము వేసి వేయించాక.. పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఓ ఐదు నిమిషాలు నూనెలో వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గించేలా చేయాలి. ఈలోపు గుడ్లను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తురుమును మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసి బాగా కలపాలి. కావాలి అనుకునేవారు కొద్దిగా వాటర్ వేసి ఇగురులా దించుకోవచ్చు. లేనివాళ్లు ఫ్రైలా దించేసుకోవచ్చు. చివరిలో కొద్దిగా కరివేపాకు, కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ కీమా మసాలా సిద్ధం.

Latest Articles