మీకు గురక రాకుండా ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

TV9 Telugu

25 June 2024

అధిక బరువు ఉన్న వారిలో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్‌ ఉంటాయి. ఇది గొంతును క్లియర్‌ చేస్తుంది. గురక నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.

ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లింగి తింటే గురక సమస్య తగ్గుతుంది. రాత్రి భోజనంలో ఈ మూడు ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు.

పైనాపిల్‌, అరటిపండు, కమలలో మెలటోనిన్‌ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఆహారం తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.

ఆవు, గెదె పాలు తీసుకోవడం బదులుగా సోయా పాలు తీసుకుంటే మంచిది. సోయా పాలు తాగితే మీ గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

అర టీ స్పూన్‌ తేనె అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, కలిపి రాత్రి నిద్రపోయే ముందుతాగడం వలన గురక తగ్గుతుంది. తేనె గురకను తగ్గిస్తుంది.

పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో సహాయపడుతుంది. దీన్ని తైలం రూపంలో గానీ, లేదా గోరువెచ్చని నీళ్లలో పుదీనా ఆకులను నానబెట్టి గానీ తీసుకోవాలి.