వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినండి.. ఇన్ఫెక్షన్లకు గుడ్ బై చెప్పండి
TV9 Telugu
25 June 2024
బ్లూ బెర్రీ: బ్లూ బెర్రీ తినడం వల్ల తక్కువ క్యాలరీలు, ఐరన్,ఫెలేట్, పొటాషియం, మిటమిన్ల వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి చిన్న వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడతాయి.
బొప్పాయి: విటమిన్ సి బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చెర్రీస్: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటు వ్యాధులు రాకుండా నివారిస్తాయి. అంతే కాకుండా మెదడుకు ప్రశాంతత, విశ్రాంతిని అందిస్తాయి.
పియర్స్: పియర్స్ పండ్లలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. కాబట్టి వర్ష కాలంలో క్రమం తప్పకుండా పియర్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
లిచీ: లిచీ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో శక్తి సామర్థ్యాలను పెంచడంతో పాటు రోగ నిరోదక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
దానిమ్మ: దానిమ్మ గింజలు అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ సి రోగ నిరోదక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు ,దగ్గులను దూరం చేస్తుంది.
యాపిల్స్: రోజుకు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు. కారణం అందులోని పోషకాలు అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.