ప్రభాస్ 'కల్కి' మిడ్‌నైట్ షోలు అందుకే వేయట్లేదా?

TV9 Telugu

25 June 2024

ప్రస్తుతం సోషల్ మీడియాలోనైనా, బయటనా ప్రభాస్ 'కల్కి' సినిమా తప్ప మరో మాట వినిపించడం లేదు

ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి లేదా టికెట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.

 హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగారాల్లో చాలాచోట్ల కల్కి సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.

కాగా కల్కి సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు కూడా అనుమతులను మంజూరు చేశాయి

అయితే ఎక్కడా కానీ కల్కి సినిమా మిడ్ నైట్ షోలు, బెన్ ఫిట్ షోలు వేయట్లేదు. దీనికి కారణమేంటో తెలుసా?

అర్థరాత్రి అంటే కొందరైనా సరే మద్యం సేవించి వచ్చిన వాళ్లు ఉంటారు. వీరి వల్ల  థియేటర్లలోనూ  గొడవలయ్యే అవకాశముంది.

అలాగే రాత్రి అంటే నిద్రలేకుండా సినిమా చూడాల్సి వస్తుంది. దీంతో సూపర్బ్ సీన్స్ కూడా సరిగా అర్థం కాకపోవచ్చు.

ఉదయం అయితే ఫ్రెష్‌ మైండ్‌తో థియేటర్‌కి వస్తారని, అప్పుడే జెన్యూన్ టాక్ వస్తుందన్న కారణంతో మిడ్ నైట్‌షోలపై టీమ్ నిర్ణయం తీసుకుందట.