
దూదిలాంటి మెత్తటి పూరీలు కావాలంటే, పిండి కలిపేటప్పుడు పూర్తిగా నీళ్లకు బదులుగా సగం నీళ్లు, సగం గోరువెచ్చని పాలు వాడితే పూరీలు బాగా పొంగుతాయని. సెలెబ్రిటీ షెఫ్ రణ్‌వీర్ బ్రార్ సూచింయా చెబుతున్నారు. పిండి కలిపేటప్పుడు 1 కప్పు గోధుమ పిండిలో 1 చెంచా తాజా పెరుగు లేదా మీగడ కలపాలని.. దీనివల్ల పిండి చాలా మృదువుగా మారుతుంది, పూరీలు ఎక్కువ సమయం ఫ్రెష్‌గా, పొంగుతూ ఉంటాయని తెలిపారు. మీకు పూరీలు కాస్త క్రిస్పీగా రావాలంటే.. 2 కప్పుల గోధుమ పిండిలో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ల సన్నటి ఉప్మా రవ్వ యాడ్ చేస్తే సరిపోతుంది.
పర్ఫెక్ట్ పూరీ కోసం కావాల్సిన పదార్థాలు
పర్ఫెక్ట్ పూరీల తయారీ విధానం
ఫర్ఫెక్ట్ పూరీలు తయారు చేసేందుకు ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, రవ్వ, వాము, ఉప్పు, 1 చెంచా నెయ్యి వేయండి. చేత్తో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోండి. పూరీ పిండి చపాతీ పిండిలా మెత్తగా ఉండకూడదు. అలా ఉంటే పూరీలు నూనె పీల్చుకుని, వెంటనే చదునుగా మారిపోతాయి.
ఇప్పుడు కలిపిన పిండిపై కొద్దిగా నూనె రాసి, తడిపిన కాటన్ వస్త్రంతో కప్పి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత పిండిని మరో 1 నిమిషం పాటు బాగా పిసికి, సమాన పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఉండలకు పొడి పిండి చల్లడానికి బదులుగా కొద్దిగా నూనె రాసి సమానంగా పూరీల్లా సాదుకోండి.
ఇప్పుడు కడాయిలో నూనెను బాగా వేడి చేయండి. నూనె నుండి తేలికపాటి పొగ వచ్చేటప్పుడు మంటను మీడియం-హైకి తగ్గించి నూనెలో పూరీని వేయండి. పూరీ వేసిన వెంటనే, చిల్లుల గరిటెతో దానిని తేలికగా నొక్కండి. పూరీ వెంటనే బెలూన్‌లా పైకి పొంగుతుంది. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. అంతే ప్లఫీ ఫ్లఫీగా ఉండే ఫర్ఫెక్ట్ పూరీలు రెడీ అయినట్టే.. వాటిని ఆలూకుర్మా లేదా సాగుతో తింటే.. టేస్ట్ అదిరిపోతుందంతే.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.