Onions Powder: ఉల్లిపాయల పొడి ఇలా చేస్తే.. ఎప్పుడైనా కూరల్లో వాడొచ్చు!

| Edited By: Ravi Kiran

Jan 17, 2024 | 11:30 AM

ఉల్లిపాయలు లేకుండా ఎలాంటి కూర వండలేం. ఉల్లిపాయ ధరలకు రెక్కలు వచ్చినా.. కనీసం ఒక ఉల్లిపాయ లేనిదే కూర చేయలేం. అదే విధంగా ఉల్లిపాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఏ కూర వండాలన్నా ఉల్లి పాయలు కోయాల్సిందే. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లి పాయలు కట్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. అదే ఒకటేసారి ఉల్లి పాయ పొడిని రెడీ చేసుకుని పెట్టుకుంటే.. నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్లి పొడితో ఇగురులు, పులుసులు..

Onions Powder: ఉల్లిపాయల పొడి ఇలా చేస్తే.. ఎప్పుడైనా కూరల్లో వాడొచ్చు!
Onion Powder
Follow us on

ఉల్లిపాయలు లేకుండా ఎలాంటి కూర వండలేం. ఉల్లిపాయ ధరలకు రెక్కలు వచ్చినా.. కనీసం ఒక ఉల్లిపాయ లేనిదే కూర చేయలేం. అదే విధంగా ఉల్లిపాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఏ కూర వండాలన్నా ఉల్లి పాయలు కోయాల్సిందే. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లి పాయలు కట్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. అదే ఒకటేసారి ఉల్లి పాయ పొడిని రెడీ చేసుకుని పెట్టుకుంటే.. నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉల్లి పొడితో ఇగురులు, పులుసులు వండుకోవచ్చు. మరి ఈ ఉల్లి పొడిని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉల్లి పొడి తయారీ విధానం:

ఉల్లి పొడి తయారు చేసుకోవడానికి ముందు ఫ్రెష్‌గా ఉల్లి పాయల్ని ఎంచుకోవాలి. ఉల్లి పాయలకు పైన తొక్క తీసేసి.. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా తరిగిన ముక్కల్ని ఎండలో బాగా ఎండ బెట్టాలి. ఎండ సరిగా రాని వాళ్లు ఓవెన్‌లో కడా హీట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇవి పొడిగా మారతాయి. ఇలా చేస్తే ఉల్లి పాయలు పొడిగా మారతాయి. వాటిని మిక్సీలో వేస్తే పొడిగా మారతాయి. వీటిని ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఓవెన్ లేని వారు గ్యాస్ మీద కడాయిలో మీడియం మంటపై కూడా ఉల్లి పాయల్ని వేయించుకోవచ్చు. ఉల్లి పాయలు అస్సలు మాడకూడదు. మాడిన ఉల్లి ముక్కలు ఉంటే వాటిని తీసి పక్కకు పెట్టేయండి. వీటి వల్ల పొడి రిచి మారిపోతుంది. ఇలా తయారైన ఉల్లి పొడిని ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. గాలి చొరబడకుండా చూసుకోవాలి. ఇలా తయారైన పొడిని ఎప్పటికప్పుడు కూరల్లో వేసుకుని తినొచ్చు. ఉల్లిపాయ ముక్కల్ని పొడి చేసుకుని పెట్టుకుంటే.. ఎప్పటికప్పుడు కూరలు వండుకోవచ్చు. సమయం కూడా సేవ్ అవుతుంది.