ఈ మూడింటిని మీ ఆహరంలో చేర్చితే.. గ్యాస్ట్రిక్‌ సమస్యకు చూమంత్రం వేసినట్టే.. మళ్లీ మీ దరిచేరవు!

మారుతున్న లైఫ్‌ స్టైల్‌, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా చాలా మంది ఎదుర్కొనేది కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య. ఈ సమస్య నుండి బయటపడటానికి జనాలు వివిధ మందులు తీసుకుంటారు. కానీ ఇవి ఈ సమస్యకు పూర్తి పరిష్కారాన్ని అందించవు. కానీ మన ఇంటి పరిసరాల్లో లభించే కొన్ని వస్తువులు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.

ఈ మూడింటిని మీ ఆహరంలో చేర్చితే.. గ్యాస్ట్రిక్‌ సమస్యకు చూమంత్రం వేసినట్టే.. మళ్లీ మీ దరిచేరవు!
Gastric Problem

Updated on: Sep 01, 2025 | 11:41 AM

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం తిన్నం ఆహారం మంచిగా జీర్ణమై శరీర భాగాలకు వెళ్లాలన్నా మనకు బలమైన జీర్ణవ్యవస్థ అవసరం. అందుకే మన జీర్ణవ్యస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఇటీవల కాలంలో ఫాస్ట్‌లైఫ్‌, ప్రాసెస్‌ చేసి ఆహార పదార్థాలను తీసుకోవడం అనే ప్రజలు పేగు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో మనకు కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. కానీ ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపసమనం పొందలేకుంటారు. కానీ మన ఇంటి పరిసరాల్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటనే విషయానికి వస్తే..

గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్‌ పెట్టే ఆహార పదార్థాలు

కలబంద: కలబంద చర్మానికి, జుట్టుకు మాత్రమే కాకుండా మన జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. కలబంద జెల్ అనే మన కడుపు మంట, గ్యాస్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మలబద్దకం, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలు ఉన్న వారు ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత అర గ్లాసు కలబంద జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా ఆ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అలాగే దీన్ని తాగడం ద్వారా మన పేగులు శుభ్రపడుతాయి. కడుపు నొప్పి నుండి కూడా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

ఉసిరి: ఆయుర్వేదంలో, ఉసిరకాయను పండ్ల అమృతం అని పిలుస్తారు. దీనిని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెబుతారు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల మన కడుపు శుభ్రపడుతుందని.. దీని వల్ల మనకు ఎలాంటి జీర్ణ సమస్య రావని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు ఉసిరి ఒక్కటే తినలేకపోతే.. దాన్ని తేనెతో కలిపి తీసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్, శరీరంలోని అంతర్గ వాపు నుండి మీరు తక్షణ ఉపశమనం పొందవచ్చు.

త్రిఫల పొడి : కడుపు సంబంధిత సమస్యలకు త్రిఫల పొడి ఒక దివ్యౌషధం అని చెబుతారు. పడుకునే ముందు 1 టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే ఇది మన ప్రేగు ఆరోగ్యాన్ని కూడా బలోపేతం చేస్తుంది. త్రిఫల పొడిని రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని హానికరమైన విషం తొలగిపోతుంది. అలాగే కడుపు తేలికగా ఉంటుంది.

జీవనశైలిలో తీసుకోవాల్సిన ఇతర మార్పులు

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న చిట్కాలను పాటించడంతో పాటు, మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తినడం, మీ శరీరానికి సరపడ నిద్రపోవడం, రోజూ యోగా చేయడం వంటికి అలవాటు చేసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే.. నూనె, సుగంధ ద్రవ్యాలు, ఇతర జంక్ ఫుడ్స్‌కు కొద్దిగా దూరంగా ఉండండి. ప్రతిరోజూ ప్రాణాయామం, ధ్యానం చేయండి. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.