గుండె జబ్బులు శరీరాన్ని బలహీనపరుస్తాయి.. ప్రాణాలకు కూడా పెను ముప్పుగా మారతాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు అనేది అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల వచ్చే వ్యాధి.. గత కొన్ని దశాబ్దాలుగా మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా దిగజారాయి. అంతేకాకుండా ఇప్పుడు శారీరక శ్రమలు సైతం తగ్గిపోతున్నాయి.. ప్రజలు సహజమైన వాటిని తినకుండా ప్యాక్డ్ ఫుడ్స్ తినడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా గుండె సమస్యలు, గుండెపోటుకు కారణమవుతున్నాయి. అందుకే.. ఈ ప్రాణాంతక సమస్యల నుంచి బయటపడాలంటే.. తినే ఆహారం నుంచి రోజువారి జీవనశైలిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండెపోటు రాకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలని.. డైటీషియన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో యువతతో పాటు వృద్ధుల్లోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఈ ముఖ్యమైన అవయవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ మొదటి ప్రాధాన్యతగా ఉండాలంటున్నారు. ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారం మీకు గుండెపోటును కలిగిస్తుంది. మరోవైపు, తక్కువ సోడియం, అధిక ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, గింజలు, విత్తనాలు కలిగిన ఆహారం వాపు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుందని పేర్కొంటున్నారు. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అవోకాడో: ఈ పండులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. తద్వారా ప్లేక్/బ్లాక్ ఏర్పడటం, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంతో పాటు, అవకాడో క్యాన్సర్, ఆర్థరైటిస్, డిప్రెషన్/టెన్షన్, ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
విత్తనాలు: చియా విత్తనాలు, జనపనార విత్తనాలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, వాల్‌నట్స్ గుండె ఆరోగ్యానికి చాలామంచిది. ఈ విత్తనాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి గుండెను సమస్యల నుంచి కాపాడుతాయి..
దాల్చిన చెక్క: మసాలా దినుసు దాల్చిన చెక్క కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే దీనిని తీసుకోవడం చాలామంచిదని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష: ద్రాక్ష అనేది పొటాషియం స్టోర్‌హౌస్.. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. అవి క్వెర్సెటిన్, రెస్వెరాట్రాల్ వంటి పాలీఫెనాల్స్‌తో సహా అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రేప్ సీడ్ ఆయిల్‌లో లినోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది.. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది.
వాల్నట్స్: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌లో పుష్కలంగా ఉన్న వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల మీ గుండెలో మంటను తగ్గిస్తుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..