
పాలకూర సూప్: బరువు తగ్గడానికి పాలకూర, బచ్చలికూర సూప్ తీసుకోవడం చాలా మంచిది. మీరు పాలకూరను సలాడ్ లేదా కూర వండుకొని తినవచ్చు. కానీ దాని సూప్ ఆరోగ్యానికి మరింత మంచిదని పేర్కొంటున్నారు.

క్యారెట్ సూప్: చలికాలంలో సులభంగా లభించే క్యారెట్ సూప్ ఆరోగ్యకరమైనది. శరీరానికి సరైన పోషకాహారాన్ని అందించే క్యారెట్‌లో విటమిన్లు, పోషకాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గడానికి దీన్ని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవడం మంచిది.

గుమ్మడికాయ వెల్లుల్లి సూప్: ఉదరం సమస్యలను దూరం చేసి.. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే గుమ్మడికాయ సూప్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో పసుపు, వెల్లుల్లిని కలపి తీసుకుంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు రోగనిరోధక శక్తిని పెరగడంతోపాటు.. బరువు తగ్గొచ్చు.

క్యాబేజీ సూప్: బరువు తగ్గే సమయంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. కావును అలాంటి వారు క్యాబేజీ సూప్‌ని ప్రయత్నించవచ్చు. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును ఈ సూప్‌తో కరిగించవచ్చని అంటున్నారు నిపుణులు.

సొరకాయ సూప్: సొరకాయ అసిడిటీ, అజీర్ణం, అల్సర్, మలబద్ధకాన్ని దూరం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లాంటివి కూడా తక్కువగా ఉంటాయి.