Health Tips: అసిడిటి సమస్య చిన్నా, పెద్ద తేడా లేకుండా వేధిస్తుంటుంది. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా వరకు ఆహారం తీసుకున్న తర్వాత అసిడిటి సమస్య ఎక్కువగా బాధిస్తుంది. కడుపులో ఎక్కువగా ఆమ్లత్వం పెరిగిపోవడంతో ఈ సమస్య ప్రారంభమవుతుంది. అంటే… మసాలా ఆహారం, జంక్ ఫుడ్.. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. అయితే చాలా మంది అసిడిటి సమస్య వచ్చిన ప్రతి సారీ టాబ్లెట్స్ తో తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ శాశ్వత పరిష్కరం మాత్రం చూపరు. మీ రోజూ వారీ జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమం పొందవచ్చు.
పొట్టలో గ్యాస్ ఒక సాధారణ సమస్య. ఇందుకోసం చాలామంది చికిత్స కోసం వైద్యుల దగ్గరికి వెళ్తారు. అయితే హోమ్ రెమిడీస్‌తో కూడా పొట్ట గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు. పొట్ట నుంచి గ్యాస్ ను తొలగించాలంటే, పెసరపప్పు, పెసర్లు, బఠాణీలు, బఠాణీలు, బంగాళాదుంపలు, శెనగలు, బియ్యం, అలాగే కారం ఎక్కువగా ఉండే మిరపకాయల్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. కూరగాయలు, కిచిడీ, పిండితో తయారు చేసిన రొట్టె, పాలు, గుమ్మడి, పాలకూర, టిండా, టర్నిప్, అల్లం, ఉసిరి, నిమ్మ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇందులో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలు ఉండదవు. పొట్ట సమస్యలకు అల్లం అద్భుతమైన ఔషధం. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉండవు. పెప్పర్ మింట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉంటాయి. నొప్పి కలిగినా, పుదినా సిరప్ లేదా జ్యూస్ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మను సేవించడం వల్ల పొట్టకు చాలా లాభదాయకంగా ఉంటుంది.
అసిడిటీ సమస్యను తగ్గించడంలో తులసి ఆకులు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇవి అసిటిడీని తొలగించడమే కాకుండా.. మానసకి, అనేక శారీరక వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అసిడిటీని తగ్గించడానికి తులసి ఆకుల కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకులు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. మసాలా ఆహారాన్ని తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలాలి. అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా, ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే మరీ మంచిది.