Garlic Peels Benefits: సాధారణంగా.. వెల్లుల్లిలో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. భారతీయ వంటలలో ప్రతి వంటకంలోనూ వెల్లుల్లి పేస్ట్ ను ఉపయోగిస్తుంటాము. అయితే వెల్లుల్లి పొట్టు కూడా శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
వెల్లుల్లి పొట్టుతో కలిగే ప్రయోజనాలు..
1. పాదాల వాపును తగ్గించడంలో వెల్లుల్లి తొక్కలు ఎక్కువగా సహాయపడతాయి. గోరువెచ్చిని నీటిలో వెల్లుల్లి పొట్టు వేసి.. మీ పాదాలను ముంచి కాసేపు ఉండనివ్వాలి. తద్వారా పాదాల వాపు తగ్గుతుంది.
2. చలి నుంచి ఉపశమనం నుంచి పొందడానికి వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి మరిగించాలి.. ఆ నీటిని తాగడం వలన చలి జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. చర్మ సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి పొట్టు సహాయపడుతుంది. చర్మంపై వచ్చే దురదను తగ్గించడానికి వెల్లుల్లి పొట్టును నీటిలో వేడి చేసి.. వాటిని దురద వచ్చే స్థలంలో రాయాలి.
4. అలాగే జుట్టు సమస్యలను తొలగిస్తుంది. వెల్లుల్లి పొట్టును పేస్ట్ గా మార్చి దానిలో కొన్ని నిమ్మరసం చుక్కలు కలిసి తలకు పట్టించాలి.. జుట్టు సమస్యలను తొలగిపోవడమే కాకుండా.. పేలు సమస్య కూడా పోతుంది.
5. మొక్కల మొదట్లో వేయడం వలన అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు పోషకాలను అందించడంలో వెల్లుల్లి పొట్టు సహాయపడుతుంది.
6. వెల్లుల్లి పొట్టును సూప్, స్టాక్స్, కూరగాయలలో ఉపయోగించడం వలన రుచి పెరగడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
WTC Final 2021: కోహ్లీ సేనకు ‘భారత ఆర్మీ’ సపోర్ట్.. ! స్టేడియంలో ఉత్సాహపరిచేందుకు రెడీ అంటూ వీడియో..