పప్పులు(Pulses) తింటే శరీరానికి మంచిదే.. కానీ పప్పులు అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు పప్పులు ఎక్కువగా తింటారు. కొన్ని పల్లెటూళ్లలో అయితే రోజూ రాత్రి పూట పప్పు చేసుకునే తింటారు. పప్పుల్లో చాలా మొత్తంలో ప్రోటీన్లు(Proteins) ఉంటాయి. ఈ పప్పులు ఎక్కువగా తీసుకుంటే కడుపులో నొప్పి, అజీర్ణం ఇంకా అలాగే గ్యాస్(Gas) సమస్య రావచ్చు. పప్పులు అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. పప్పులు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పప్పులో ఆక్సలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
పప్పులో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. మీకు థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లయితే ఇక మీరు పప్పుధాన్యాలను అసలు ఎక్కువగా తినకూడదు, శరీరంలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు ఉండడం వల్ల ఈ థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. మీరు అతిగా పప్పులు తీసుకుంటే, బరువు కూడా చాలా వేగంగా పెరుగుతారు.ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం అనేది కేలరీలను పెంచుతుంది. ఇంకా అలాగే ఎక్కువ బరువు పెరుగుటకు కూడా దారితీస్తుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Also.. Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే..