AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. రాత్రిపూట రెండు తినండి చాలు.. ఆ సమస్యలన్నీ ఫసక్..

జొన్న రొట్టెలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేవారికి అద్భుతమైన ఆహారం. ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌తో నిండి ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచి, మధుమేహాన్ని నియంత్రించి, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు గుండె, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెను చేర్చుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు..

అద్భుతం.. రాత్రిపూట రెండు తినండి చాలు.. ఆ సమస్యలన్నీ ఫసక్..
Jowar Roti Unlocking Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2026 | 6:54 PM

Share

ఆధునిక జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా, పాతకాలపు ఆహారపు అలవాట్లను, ప్రత్యేకించి పోషకాలు నిండిన సంప్రదాయ ధాన్యాలను తిరిగి తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. జొన్న రొట్టెలు అలాంటి అద్భుతమైన ఆహారాలలో ఒకటి. ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా జొన్న రొట్టె రాత్రిపూట అన్నానికి బదులు తింటే.. చాలా ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. బరువువ తగ్గడంతోపాటు.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. జొన్న రొట్టెలలోని పోషక విలువలు.. అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శక్తినిచ్చే గుణం: జొన్న రొట్టెలు కార్బోహైడ్రేట్లు – ప్రొటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోజువారీ జొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల శరీరం శక్తిని చక్కగా గ్రహించి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది శారీరక శక్తి తగ్గకుండా చూసి, అలసటను తగ్గిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ: జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధంగా పని చేయిస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సజావైన జీర్ణక్రియ వల్ల శరీరానికి తేలికపాటి అనుభూతి కలుగుతుంది.

బరువు నియంత్రణ: జొన్న రొట్టెల్లోని అధిక పీచు పదార్థం త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీని ద్వారా అధిక క్యాలరీల జోలికి వెళ్లకుండా నియంత్రణ సాధించవచ్చు.. తద్వారా అధిక బరువును సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అంతేకాకుండా, ఇది శరీరంలోని అనవసరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ: జొన్న రొట్టెలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో జొన్న రొట్టెలను చేర్చుకోవడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధంగా ఉంచుకోవచ్చు.

గుండె ఆరోగ్యం: జొన్న రొట్టెల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధులను నివారించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో జొన్న రొట్టెలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

పోషకాల గని, ఎముకల బలం: జొన్న రొట్టెల్లో పొటాషియం, విటమిన్ బి, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రత్యేకించి మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల బలాన్ని పెంచి, వాటిని దృఢంగా మారుస్తాయి. ఇది ఎముకల సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

ఈ ప్రయోజనాలన్నీ జొన్న రొట్టెలు కేవలం ఒక సాధారణ ఆహారం కాదని, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే ఒక అద్భుతమైన ధాన్యం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. మితంగా తీసుకోవడం మంచిది..

గమనిక.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.. 

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us