చియా సీడ్స్‌ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్‌.. మలబద్ధకం పరార్.. !

తరచూ చియా సీడ్స్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. 

చియా సీడ్స్‌ ఇలా తిన్నారంటే మీ గుండె పదిలం.. ఎనర్జీ డబుల్‌.. మలబద్ధకం పరార్.. !
Lemon Water And Chia Seeds

Updated on: Jul 05, 2025 | 1:55 PM

చియా సీడ్స్‌.. ప్రస్తుతం చాలా మంది వీటిని తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్నగా నల్లని రంగులో కనిపించే చియా సీడ్స్‌.. పుష్కలమైన పోషకాలు నిండి వున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ చియా విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అందుకే వీటిని చాలా మంది నీటిలో నానబెట్టి తీసుకుంటారు. చియా గింజలు కరగని, కరిగే ఫైబర్ రెండింటినీ కలిగి ఉంటాయి. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చియా గింజలు ద్రవాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి, మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.

చియా గింజలు ప్రీబయోటిక్‌గా పనిచేస్తాయి. ఇది గట్ సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినడం వల్ల వాటి జీర్ణక్రియ సులభతరం అవుతుంది. చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం కలుగుతాయి. చియా విత్తనాలను తినేటప్పుడు పుష్కలంగా నీరు త్రాగటం ముఖ్యం, లేకుంటే మీకు మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ సలాడ్లు, పెరుగు లేదా స్మూతీలకు చియా విత్తనాలను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

తరచూ చియా సీడ్స్‌ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నీరసం, అలసట సమస్యలతో బాధపడేవారికి ఇవి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. రోజంతా శక్తిని అందిస్తాయి. ఇవి తింటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే చియా గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..