
ఈ కూరను వేడి అన్నంతో పాటు చపాతీ, రోటీ, పరాటా వంటి వాటితో కూడా తినవచ్చు. పెరుగు అందించే క్రీమీ టెక్స్చర్‌కు గుడ్డు కలవడంతో కూరకు మంచి రుచి వస్తుంది. మరి ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు
గుడ్లు – 6
పెరుగు – 2½ కప్పులు
ఉల్లిపాయ – 1
పచ్చిమిరపకాయలు – 5
కొత్తిమీర – ½ గుప్పెడు
కొబ్బరి నూనె – 5-6 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – ½ చెంచా
పసుపు – ¼ చెంచా
కారం – ½ చెంచా
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1. గుడ్లను ఉడికించండి
ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి గుడ్లను వేసి బాగా ఉడికించాలి. గుడ్లు ఉడికిన తర్వాత చల్లార్చి పెంకు తొలగించాలి. అనంతరం వాటిని సగానికి కోసి పక్కన పెట్టుకోవాలి.
2. పెరుగు సిద్ధం చేసుకోండి
ఒక గిన్నెలో చిక్కటి, పులియని పెరుగు తీసుకుని బాగా గిలకొట్టాలి. అందులో తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత నిలువుగా సన్నగా తరిగిన ఉల్లిపాయను పెరుగులో వేయాలి.
3. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలపండి
ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీరను పెరుగులో వేసి బాగా కలపాలి. అయితే ఎక్కువసేపు గిలకొట్టకుండా అవసరమైనంత మాత్రమే కలపడం మంచిది. ఆ తర్వాత సగానికి కోసిన ఉడికించిన గుడ్లను ఇందులో వేయాలి.
4. మసాలా తాలింపు ఇవ్వండి
ఇప్పుడు ఒక బాణలిలో కొబ్బరి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తర్వాత పసుపు, కారం వేసి కొద్దిసేపు కలపాలి.
5. పెరుగు-గుడ్డు మిశ్రమాన్ని కలపండి
మసాలా కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు-గుడ్డు మిశ్రమాన్ని బాణలిలో వేసి నెమ్మదిగా కలపాలి. పెరుగు ఎక్కువగా మరిగించకుండా తక్కువ మంటపై కొద్దిసేపు వేడి చేయాలి.
6. వేడివేడిగా సర్వ్ చేయండి
అంతే.. రుచికరమైన పెరుగు-గుడ్డు కూర సిద్ధం. దీన్ని వేడి అన్నం, చపాతీ, రోటీ, పరాటా లేదా అప్పంతో సర్వ్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ కూర బిజీగా ఉన్న రోజుల్లో మంచి ఆప్షన్‌గా ఉంటుంది.