Endu Nethallu Curry: కోనసీమ స్టైల్‌లో ఎండు మెత్తళ్ళతో ఇలా కూర చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..

మాంసాహార ప్రియులు ముక్క లేనిదే ముద్ద గొంతు దిగదు అని అంటారు. నాన్ వెజ్ కూరలు తినడానికి అందుబాటులో లేనప్పుడు.. ఇంట్లో ఉండే కోడి గుడ్లు, లేదా ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలా ఏవి ఉంటే వాటితో అప్పటికప్పుడు కూర చేసుకుని హ్యాపీగా అన్నం తినేస్తారు. అవును కొంతమంది ఎండు చేపలుతో చేసిన కూర అంటే మహా ఇష్టం. ఈ రోజు ఎండు మెత్తళ్ళు (నెత్తళ్ళు) ఇగురు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..

Endu Nethallu Curry: కోనసీమ స్టైల్‌లో ఎండు మెత్తళ్ళతో ఇలా కూర చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
Endu Nethallu Curry

Updated on: Apr 18, 2025 | 12:46 PM

సీఫుడ్ ప్రియులలో చేపలను ఇష్టంగా తినేవారు ఎక్కువ మంది ఉంటారు. పచ్చి చేపలతో కూర, పులుసు, బిర్యానీ, వేపుడు రకరకాల రుచుకరమైన ఆహార పదార్ధాలను ఎలా తయారు చేసుకుంటారో.. అదే విధంగా ఎండు చేపలతో కూడా తయారు కూర, పులుసు, వేపుడు వంటి తయారు చేసుకుంటారు. ఈ ఎండు చేపలు చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఎండు నెత్తళ్ళు. వీటినే మెత్తళ్ళు అని కూడా అంటారు. ఈ రోజు
మెత్తళ్ళ ఇగురు రెసిపీ తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

మెత్తళ్ళు (నెత్తళ్ళు) – ఒక కప్పు

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ – ఒకటి

పచ్చి మిర్చి- 2

టమాటాలు – 2

వెల్లుల్లి రెమ్మలు – 6

ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు

కారం – రెండు టీ స్పూన్లు

పసుపు- చిటికెడు

ఉప్పు – రుచికి సరిపడా

నువ్వుల నూనె – తగినంత

కరివేపాకు – రెండు రెమ్మలు

తయారీ విధానం: ముందుగా ఎండు మెత్తళ్ళను శుభ్రం చేసుకుని కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి తగినంత నూనె పోసి వేడి ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, కరివేపాకు, పచ్చి మిర్చి చీలికలు వేయించాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం నుంచి నూనె వేరు పడే వరకూ తక్కువ మంట మీద ఉడికించి.. ఇప్పుడు ఎండు మెత్తళ్ళను వేసి మెల్లగా కూరని మెదపాలి. మంట తగ్గించి.. కొంచెం నీరు పోసి.. ఉడికించుకోవాలి. ఇష్టమైన వారు చివరగా కొత్తిమీర వేసుకుంటే నూరూరించే ఎండు మెత్తళ్ళ కూర రెడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..