Diwali Recipe: దీపావళి స్పెషల్.. కోస్తా ఆంధ్రా ఫేమస్.. కోవా కజ్జికాయ తయారీ

|

Oct 25, 2021 | 2:04 PM

Diwali Special Sweet Recipe: దీపావళి పండగ అంటేనే.. సందడి సంబరాలు.. దీపాలు,రంగు రంగుల రంగవల్లులు, బాణా సంచా, పిండి వంటలు,..

Diwali Recipe: దీపావళి స్పెషల్.. కోస్తా ఆంధ్రా ఫేమస్.. కోవా కజ్జికాయ తయారీ
Kova Kajjikayalu
Follow us on

Diwali Special Sweet Recipe: దీపావళి పండగ అంటేనే.. సందడి సంబరాలు.. దీపాలు,రంగు రంగుల రంగవల్లులు, బాణా సంచా, పిండి వంటలు, ఇవన్నీ కలబోసిన వేడుకలకు వేదిక హిందూ సంప్రదాయ పండగలు. దీపావళి రోజున స్వీట్స్ తప్పనిసరిగా తయారు చేస్తారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వంటలకు వేదికగా దీపావళి పండగ ఉంటుంది. కజ్జికాయలు భారతదేశమున లభ్యమయ్యే ఒకరకమైన మిఠాయిలు. ఎక్కువగా కోస్తాఆంధ్రలో ఫేమస్ఈ. రోజు దీపావళి స్పెషల్ గా సీట్స్ షాప్ లో లభించే కోవా కజ్జికాయ తయారీ గురించి తెలుసుకుందాం

కావలసిన పదార్థాలు

మైదాపిండి -అరకిలో
పాలకోవా – పావుకిలో
నెయ్యి -100 గ్రాములు
పంచదార- కిలో
జాపత్రి – 2 గ్రాములు
యాలకుల పొడి
శనగపిండి – 50 గ్రాములు
వంట సోడా- చిటికెడు
బేకింగ్ పౌడర్ – చిటికెడు
నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విదానం: కజ్జికాయ తయారీకి ముందుగా శనగపిండి తీసుకుని అందులో కోవా కలిపి కొంచెం నెయ్యి వేసుకుని వేయించి దింపుకోవాలి. ఈ కోవా మిశ్రమంలో జాపత్రి పొడి, పంచదార, యాలకుల పొడి కలిపి ముద్దగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలీ. మైదా పిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి.. అందులో నెయ్యి వేసి కలిపి నీరు చేర్చి పూరి పిండిలా చేసుకోవాలి. తర్వాత స్టౌ  వెలిగించి బాణలి పెట్టి.. అందులో మిగిలిన పంచదార పోసి అందులో రెండు గ్లాసుల నీరు పోసుకుని లేత పాకం వచ్చే వరకూ ఉంచి.. తర్వాత దించుకుని పక్కకు పెట్టుకోవాలి. 

పూరీ పిండి ని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పూరీలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అనంతరం ఆ  ముద్ద మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. అనంతరం వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు వచ్చేలా వేయించాలి.  అనంతరం వాటిని ముందుగా రెడీ చేసిన పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు రెడీ.. దీపావళికి, పిల్లలకు, పెద్దలకు కోవా కజ్జికాయలు తిని ఎంజాయ్ చేయండి..

Also Read:  వివాహవేడుకలో సందడి చేసిన అన్నదమ్ములు చిరు పవన్‌లు