Diwali Special Recipe: పాలవిరుగుడు లేదా పన్నీరుతో ఇంట్లోనే టేస్టీ టేస్టీ గులాబీ జామ్ తయారీ..

|

Oct 30, 2021 | 10:13 AM

Diwali 2021 Special Recipe: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే దీపావళి సందడి నెలకొంది.  దీపాలు, స్వీట్స్,..

Diwali Special Recipe: పాలవిరుగుడు లేదా పన్నీరుతో ఇంట్లోనే టేస్టీ టేస్టీ గులాబీ జామ్ తయారీ..
Paneer Gulbajamun
Follow us on

Diwali 2021 Special Recipe: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే దీపావళి సందడి నెలకొంది.  దీపాలు, స్వీట్స్, బాణాసంచా, కొత్త బట్టలు ఇవన్నీ దీపావళి పండగకు ఓ ప్రత్యేకతను తీసుకుని వస్తాయి. ముఖ్యంగా దీపావళి పండగ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వీట్స్ ఒకరికొకరు పంచుకుని శుభాకాంక్షలు చెబుతారు. ఈరోజు దీపావళి స్పెషల్ గా ఇంట్లోనే విరిగిన పాలు లేక పన్నీరు తో గులాబీ జామ్ తయారీ గురించి తెలుసుకుందాం..

తయారీకి కావలిసిన పదార్ధాలు: 

పన్నీర్ లేదా విరిగిన పాల తురుము – ఒక కప్పు
మైదా – ఒక టేబుల్ స్పూన్
నెయ్యి తగినంత
పంచదార ఒక కప్పు
నీరు ఒకకప్పు
నూనె వేయించడానికి సరిపడా
యాలకుల పొడి

తయారు చేసే విధానం: విరిగిన పాల తురుము (లేదా బజారులో దొరికే పన్నీరు) కోసం.. ముందుగా పాలను స్టౌ మీద పెట్టి.. అవి మరుగుతున్న సమయంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి.. అనంతరం ఒక స్పాన్ తో పాలను కదిపితే పాలు విరిగి ముక్కలు ముక్కలుగా ఏర్పాడతాయి. ఈ పాలను ఒక కాటర్ బట్టలో వేసి.. నీరు అంతా పోయేలా వడకట్టాలి. అప్పుడు క్లాత్ లో మిగిలింది పన్నీర్. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని స్టౌ మీద పెట్టి.. ఏమైనా అందులో నీరు ఉంటె పోయేలా వేడి చేయాలి. అలా ఏర్పడిన పన్నీరుని ఒక ప్లేట్ లోకి తీసుకుని మైదా పిండి, కొంచెం గట్టి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలా స్మూత్ అయ్యేవరకూ కలుపుకుని ఈ పన్నీరు మిశ్రమంపై క్లాత్ కప్పి ఒక పక్కకు పెట్టుకోవాలి.

మళ్ళీ స్టౌ మీద ఒక గిన్నె పెట్టి.. అందులో పంచదార వేసి.. నీరు పోసి.. కొంచెం లేత పాకం ఏర్పడే వరకూ స్టౌ మీద ఉంచి ఆ పాకంలో కొంచెం యాలకుల పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పన్నీరు మిశ్రమాన్ని తీసుకుని చేతులకు నెయ్యి రాసుకుని .. చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడే నూనె వేసి వేడి చేసుకోవాలి. అలా నూనె వేడి ఎక్కిన తర్వాత పన్నీర్ ఉండలను వేసుకుని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించుకుని .. కొంచెం చల్లారిన తర్వాత వాటిని రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. కొంత సేపటి తర్వాత అవి పాకం పీల్చుకుని స్మూత్ గా చూడగానే నోరూరించేలా పన్నీర్ గులాబీ జామ్ రెడీ..

Also Read:  ఇంట్లో ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయా.. సహజమైన సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..