Curd Benefits: వేసవిలో ఇదే అమృతం.. పెరుగుతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.. ఇంకెన్నో ప్రయోజనాలు..

|

Apr 13, 2022 | 12:01 PM

Curd Health Benefits: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

Curd Benefits: వేసవిలో ఇదే అమృతం.. పెరుగుతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.. ఇంకెన్నో ప్రయోజనాలు..
Eating Curd
Follow us on

Curd Health Benefits: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మన కడుపుకు మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. పెరుగులో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మీరు దీన్ని అల్పాహారంలో కూడా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంతో పాటు, పెరుగు జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. వేసవిలో పెరుగును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు కండీషనర్‌గా ఉపయోగించవచ్చు: వేసవి కాలంలో బలమైన సూర్యకాంతి కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. సాప్ట్ హెయిర్ కోసం చాలా ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ సందర్భంలో మీరు పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇది సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది మీ శిరోజాలను హైడ్రేట్ చేస్తుంది. ఇది పొడి, దెబ్బతిన్న జుట్టును నయం చేస్తుంది. పెరుగు, తేనె, కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేసుకోవచ్చు. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే మంచిది.

వడదెబ్బ: వేసవి కాలంలో చర్మాన్ని, శరీరాన్ని చల్లబరచడానికి పెరుగు మంచి మార్గం. ఇది వడదెబ్బకు ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు చర్మాన్ని తేమగా మారుస్తుంది. పెరుగులో జింక్, ప్రోబయోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వడదెబ్బ వల్ల ప్రభావితమైన చర్మంపై చల్లని పెరుగును పూయవచ్చు. దీన్ని 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

మజ్జిగ: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచుకోవడానికి హెల్తీ డ్రింక్స్ అవసరం. వేసవిలో పెరుగుతో చేసిన మజ్జిగను తీసుకోవచ్చు. ఇది డీహైడ్రేషన్ అలసటను తొలగిస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. మజ్జిగ మలబద్దకాన్ని దూరం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి, పెరుగు, చల్లని నీరు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ, పచ్చి కొత్తిమీరను మిక్కిలో వేయాలి. మెత్తగా చేసిన అనంతరం కొంచెం కొత్తిమీర వేసుకొని తాగవచ్చు.

పెరుగు ఫేస్ ప్యాక్ : వేసవి కాలంలో చర్మ సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెరుగు మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు పెరుగును ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, చిటికెడు పసుపు కలపి.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి,. ఈ ఫేస్ ప్యాక్ టాన్ తొలగించడానికి కూడా పనిచేస్తుంది.

Also Read:

Weight Loss: ఊబకాయంతో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ఫాలో అయితే లావు తగ్గడంతోపాటు మరెన్నో ప్రయోజనాలు..

Eggs Side Effect: గుడ్డు మంచిదని తెగ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..