AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేప కళ్లు తింటే మన కంటి చూపు షార్ప్ అవుతుందా..! ఈ సీక్రెట్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఆధునిక జీవనశైలిలో కంటి చూపు మందగించడం, మతిమరుపు వంటి సమస్యలు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి. వీటికి పరిష్కారం ఖరీదైన మందుల్లో కాదు.. మనం పారేసే చేప కళ్లలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ న్యాచురల్ సప్లిమెంట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఏ పుష్కలంగా ఉంటాయి. చూపును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ వంటి మహమ్మారిని సైతం ఎదుర్కోగల శక్తి చేప కళ్లకు ఎలా ఉందో తెలుసుకుందాం..

చేప కళ్లు తింటే మన కంటి చూపు షార్ప్ అవుతుందా..! ఈ సీక్రెట్స్ తెలిస్తే నోరెళ్లబెడతారు..
Can Eating Fish Eyes Improve Your Eyesight
Krishna S
|

Updated on: Mar 26, 2026 | 7:55 AM

Share

సాధారణంగా మనం చేపలు తెచ్చుకున్నప్పుడు ముక్కల మీద చూపించే శ్రద్ధ.. చేప తల లేదా కళ్ల మీద చూపించం. చాలామంది చేప కళ్లను తీసి పారేస్తుంటారు. కానీ ఆ చిన్న చేప కళ్లలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? పోషకాహార నిపుణుల ప్రకారం.. చేప కళ్లు కేవలం రుచి కోసమే కాదు శరీరానికి అవసరమైన అత్యంత కీలకమైన సూపర్ ఫుడ్ అని తేలింది. చేప కళ్లలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది రేచీకటిని నివారించడమే కాకుండా దృష్టి లోపాలను సరిచేస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు చేప కళ్లు తినిపిస్తే, వారి కంటి చూపు మెరుగుపడటంతో పాటు భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మెదడు చురుగ్గా.. జ్ఞాపకశక్తి మెండుగా

మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చేప కళ్లలో అధికంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా వయసుతో పాటు వచ్చే మతిమరుపు వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా నరాల సంబంధిత సమస్యలు, ఆటిజంతో బాధపడే పిల్లలకు ఇది ఒక సహజమైన ఔషధంలా పనిచేస్తుంది.

షుగర్, బీపీలకు చెక్

శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో చేప కళ్లలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇవి శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడతాయి. అలాగే ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

ఎముకల బలం.. నిద్రలేమికి దూరం

వీటిలో ఉండే విటమిన్-D, కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారికి చేప కళ్లు ఒక వరమనే చెప్పాలి. ఇందులోని విటమిన్-D మెలటోనిన్ అనే హార్మోన్‌ను ప్రేరేపించి, రాత్రిపూట హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.

క్యాన్సర్ నిరోధకంగా..

చేప కళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కణాల అసాధారణ పెరుగుదలను అరికడతాయి. తద్వారా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రుచి పరంగా కొంతమందికి చేప కళ్లు నచ్చకపోవచ్చు. కానీ పోషకాల పరంగా ఇది ఒక ఖరీదైన సంపద. కంటి చూపు, మెదడు శక్తి, ఎముకల బలం కోసం మీ తదుపరి సారి చేపలు తెచ్చుకున్నప్పుడు వాటి కళ్లను పారేయకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి.

Follow Us