Black Rice: బ్లాక్ రైస్ గురించి మీకు తెలుసా? తింటే ఇలాంటి 4 తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది!

|

Dec 19, 2022 | 5:45 PM

అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. సాధారణ రైస్ లాగా నేరుగా తినకపోయినా కొన్ని రకాల ఫుడ్స్ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Black Rice: బ్లాక్ రైస్ గురించి మీకు తెలుసా? తింటే ఇలాంటి 4 తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తుంది!
Black Rice
Follow us on

బ్లాక్ రైస్ గురించి మీరు వినే ఉంటారు. ఆ బ్లాక్ రైస్ ఎలా ఉంటుందో.. అది తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో అని కూడా మీరు తరచుగా వినే ఉంటారు. అయితే, బ్లాక్ రైస్‌తో వినియోగంతో మణిపూర్‌కి అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది. ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఈ బ్లాక్‌ రైస్‌ చాఖవో అనే గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది సులభంగా ఉడికిపోతుంది. చాలా తేలికగా జీర్ణమై మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది షుగర్ పేషంట్లకు చాలా మంచిది. అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. సాధారణ రైస్ లాగా నేరుగా తినకపోయినా కొన్ని రకాల ఫుడ్స్ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.బ్లాక్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చింగా ఆశ్చర్యపోతారు.
బ్లాక్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు

1- గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
బ్లాక్ రైస్ తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బ్లాక్ రైస్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరచడంలో ఫ్లేవనాయిడ్స్ ఆంథోసైనిన్స్ కూడా ఉపయోగపడతాయి.

2- కంటి చూపుకు మేలు చేస్తుంది:
బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, జియాక్సంతిన్ మరియు లుటిన్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును పెంచుతాయి. హాని కలిగించే మూలకాల నుండి రక్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

3- క్యాన్సర్ నుండి రక్షణ:
బ్లాక్ రైస్ తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి నుండి చాలా వరకు రక్షణ లభిస్తుంది. బ్లాక్ రైస్‌లో ఆంథోసైనిన్ ఉంటుంది. ఇది నలుపు-ఊదా రంగును కలిగి ఉంటుంది. ఈ బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి.

4- పోషకాల నిధి:
బ్లాక్ రైస్‌లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల శరీరం బలపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. బ్లాక్ రైస్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి