Vegetable Side Effects: ఈ ఐదు కూరగాయలు తింటే ఆరోగ్యమే.. అయితే ఎక్కువగా తింటే కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసా..!

|

Apr 16, 2021 | 8:47 AM

Vegetable Side Effects: మనం తినే ఆహారపదార్ధాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలను, విటమిన్స్ ను కూరగాయలు అందిస్తాయి. అయితే మనం ఇష్టమైన ఆహారపదార్ధాలను ఎక్కువగా తింటాం.. ఇష్టంలేని..

Vegetable Side Effects: ఈ ఐదు కూరగాయలు తింటే ఆరోగ్యమే.. అయితే ఎక్కువగా తింటే కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసా..!
Vegetables
Follow us on

Vegetable Side Effects: మనం తినే ఆహారపదార్ధాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలను, విటమిన్స్ ను కూరగాయలు అందిస్తాయి. అయితే మనం ఇష్టమైన ఆహారపదార్ధాలను ఎక్కువగా తింటాం.. ఇష్టంలేని వాటిల్లో ఎన్ని పోషకాలున్నా.. తినడానికి పెద్దగా ఆసక్తి చూపించం. అయితే కొన్ని కూరగాయలను తరచూ తింటే శరీరంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి కొన్ని ఆహారపదార్ధాలను తింటే ఎలర్జీలు వస్తాయి. ఇది హానికరం కాకపోయినా చిన్నపాటి ఇబ్బందులు పెడతాయి. ఈరోజు కొన్ని కూరగాయలు అధికంగా తింటే కలిగే దుష్ఫలితాల గురించి తెలుసుకుందాం..!

పుట్టగొడుగులు మాంసాహారంతో సమానం పుట్టగొడుగుల్లో విటమిన్ డి లభిస్తుంది. అయితే కొంతమందికి ఇవి తింటే అసహనం కలుగుతుంది. మరికొందరికి అలర్జీ తలెత్తవచ్చు. చర్మంపై దద్దుర్లు సర్వసాధారణంగా కనిపించే అలర్జీ.. ఎక్కువగా తక్కువగా ఉడికిన పుట్టగొడులను లేదా.. వండకుండా పుట్టగొడుగులను తింటే అలర్జీ ఏర్పడుతుంది.

Mushrooms

క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం రంగు మారుతుంది. ఇది నిజం, ఎక్కువ క్యారెట్ లేదా బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా మీ చర్మం పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. పాదాల, చేతుల మరియు అరికాళ్ళలో రంగు పాలిపోవటం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఆహార పదార్ధాల నుంచి పొందే అదనపు బీటా కెరోటిన్ రక్తప్రవాహంలోకి ప్రవేశించదు. చర్మం కింద నిల్వ చేయబడుతుంది. దీంతో క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం యొక్క రంగు తాత్కాలికంగా మారుతుంది. అంతేకాదు.. ఇటువంటి గుణం . గుమ్మడికాయ , చిలగడదుంపలను ఎక్కువగా తిన్నా కూడా కలుగుతుంది.

Carrot

బీట్ రూట్ ఎక్కువగా తిన్నవారికి మూత్రం గులాబీ రంగులో పోతుంది. మొదటి సారి చూసిన వారికి ఇది భయం కలిగిస్తుంది. అయితే ఇది బీట్‌రూట్ తినడం వల్ల కలిగే దుష్ప్రభావం మాత్రమే. బీట్ రూట్ లో ఉన్న వర్ణద్రవ్యం మరియు ఇతర రసాయనాల వలన మీ మూత్రం రంగును తాత్కాలికంగా మారుతుంది.. అంతేకాదు కొన్ని రకాల దుంపలు, బ్లాక్ బెర్రీస్ ఉన్న ఆహారాన్ని తిన్నా కూడా మూత్రం పింక్ లేదా ఎరుపుగా మారుతుంది. ఇది ఎటువంటి హానికరం కాదు కనుక ఆందోళన అవసరం లేదు.

Beet Root

బీటా కెరోటిన్ మాదిరిగానే, విటమిన్ సి అధికంగా తీసుకోవడం కూడా మూత్రం యొక్క రంగును మారుస్తుంది. విటమిన్ సి సప్లిమెంట్స్ , పండ్లు ఎక్కువ మొత్తంలో ఒక్కరోజులో విటమిన్ సి ని తీసుకుంటే.. మూత్రం నారింజ రంగులోకి మారుతుంది. అందుకని విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు దానితో పాటు ఎక్కువగా నీరు త్రాగాలి.

Oranges

Also Read:  2019 ఖతార్ డ్రగ్స్ కేసులో ముంబై జంట అరెస్ట్.. తాజాగా నిర్దోషులకుగా ఇండియాలోకి అడుగు..

ఆధార్‌కార్డు లోని మీ ఫోటో నచ్చలేదా అసంతృప్తిగా ఉన్నారా..అయితే సింపుల్‌గా మార్చేసుకోండి ఇలా..!