Kalonji Milk Benefits: భారతీయ సుగంధ ద్రవ్యాలలో చక్కటి ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆయుర్వేద మందుల తయారీకి కూడా ఉపయోగపడుతాయి. కలోంజిని ఇళ్లలో ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే కలోంజికి పాలు కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. బ్రెయిన్ షార్ప్: కలోంజి పాలు మానసిక ఎదుగుదలకు దోహదపడుతాయి. మెదడు పనితీరుకి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్, న్యూరాన్-ప్రొటెక్టింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కలోంజి పాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మెలటోనిన్ నరాలను రిలాక్స్ చేస్తాయి. ఈ పాలను నిద్రపోయే ముందు తాగితే చాలా మంచిది.
2. బరువు తగ్గడానికి సహాయపడుతుంది: కలోంజి పాలు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పెరుగుతున్న బరువును తగ్గిస్తుంది. ఆహారంలో 1 నుంచి 3 గ్రాముల కలోంజిని చేర్చడం వల్ల జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. ఉదర సమస్యలకు దరిచేరకుండా చేస్తాయి.
3. మధుమేహానికి ప్రయోజనకరం: కలోంజి విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కలోంజి పాలు తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
4. హృదయానికి మంచిది: కలోంజి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కలోంజి పాలు తాగడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయి తగ్గుతుంది వాపులను కూడా తగ్గుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి దోహదపడుతుంది.
5. నొప్పిని తగ్గిస్తుంది: కలోంజి పాలు శరీరం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గోరువెచ్చని పాలతో కలిపి తాగితే శరీర నొప్పులు తగ్గుతాయి. ఇది కాకుండా మంటను, గ్యాస్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కలోంజీ పాలను డైట్‌లో చేర్చేముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
కలోంజి పానీయం ఎలా తయారు చేయాలి
ఒక గ్లాసు పాలలో ఒక చెంచా కలోంజి పొడిని కలపాలి. రుచిని పెంచడానికి ఒక చెంచా తేనె, చిటికెడు జాజికాయ పొడిని కలపాలి. మీకు షుగర్ లేదా బరువు సమస్య ఉంటే చక్కెర, తేనె ఉపయోగించకూడదు.