Health Tips: పీరియడ్స్‌లో పెరుగు తినడం సురక్షితమా.. కాదా? నిపుణులు ఏమంటున్నారంటే?

|

Feb 17, 2022 | 7:10 AM

Benefits Of Curd: పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదని తరచుగా పెద్దలు చెబుతుంటుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం దీనికి విరుద్ధంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో పెరుగు తీసుకోవడం..

Health Tips: పీరియడ్స్‌లో  పెరుగు తినడం సురక్షితమా.. కాదా? నిపుణులు ఏమంటున్నారంటే?
Curd
Follow us on

Health Tips: పీరియడ్స్ (Periods)సమయంలో పెరుగు(Curd) తినొచ్చా.. లేదా.. తినకూడదా? పెద్దలు మాత్రం పీరియడ్స్ సమయంలో పెరుగు తినొద్దని చెబుతుంటారు. నిజానికి పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పుల (Hormonal Changes) వల్ల గర్భాశయం సంకోచం, వాపు మొదలైన అనేక సమస్యలు వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, చల్లని, పుల్లని పదార్థాలు తినకూడదని సలహా ఇస్తుంటారు. పులుపు జలుబును పెంచేందుకు సహాయపడతాయి. దాని వల్ ఆ సమయంలో కడుపులో నొప్పి తీవ్రమవుతుందని చెబుతుంటారు. అయితే, పెరుగు పుల్లగా ఉండడం వల్ల మరింత ప్రభావం చూపవచ్చని అంటుంటారు. మరి, పెరుగు గురించి నిపుణుల అభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం సురక్షితమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు తినకూడదనే ఆలోచన కేవలం అపోహ మాత్రమే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదనే ఆలోచన ఒక అపోహ. నిజానికి, పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయని నమ్ముతారు. పీరియడ్స్ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల కండరాల నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. పెరుగు కాల్షియంకు మంచి మూలం. కాబట్టి ఇది ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. పెరుగు తినడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో జీర్ణ సమస్యలను తగ్గించే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల, పీరియడ్స్ సమయంలో మీరు పెరుగును సౌకర్యవంతంగా తీసుకోవచ్చు. అయితే తాజా పెరుగు మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

రాత్రిపూట పెరుగు తినకూడదు..

మీరు పెరుగు తినాలని అనుకుంటే మాత్రం పగటిపూట మాత్రమే తినండి. రాత్రిపూట తినకూడదు. నిజానికి చల్లగా ఉండటం వల్ల రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల పిత్త, కఫం సమస్యలు పెరుగుతాయి. అందువల్ల పగటిపూట మాత్రమే పెరుగు తినండి. అయితే తాజా పెరుగు మాత్రమే తినాలి.

పీరియడ్స్ సమయంలో ఈ విషయాలకు దూరంగా ఉండండి..

నిజానికి పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు ఐరన్, క్యాల్షియం తదితర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది కాకుండా, మితిమీరిన మసాలా ఆహారం, అధిక ఉప్పు, అధిక కాఫీ వినియోగం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు పదార్ధాల వినియోగం తగ్గించాల్సి ఉంటుంది.

Also Read: Green Chilli: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ 5 ఆహారాలను దూరం పెట్టండి.. లేదంటే ఏమవుతుందో తెలుసా!