ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యం దృష్టిసారించడం మంచిది. అయితే.. ఈరోజుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ప్రాణాంతకంగా మారుతోంది.. దీనిని వైద్యులు సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటున్నారు.. వాస్తవానికి కొలెస్ట్రాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వాస్కులర్ డిసీజ్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిని నియంత్రించడానికి ఈ పండు బాగా ఉపయోగపడుతుందని.. ఇది అమృతంతో సమానమని డైటీషియన్లు చెబుతున్నారు.. అదేంటో కాదు.. అవకాడో..
అవకాడో తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందించడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూర్చుతుందని.. తప్పనిసరిగా ఆహారంలో అవకాడోను చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
వాస్తవానికి అవకాడో ఖరీదైన పండు.. అయితే ఈ పండును తినే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పెరిగింది.. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం మొత్తం అభివృద్ధికి ఇది చాలా సహాయకారిగా ఉంటుందని చెబుతారు. అవకాడోలో పొటాషియం, విటమిన్లు బి, ఇ, సి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మీడియం-సైజ్ అవోకాడోలో 240 కేలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్, 22 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి.. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతాయని ఓ అధ్యయనం పేర్కొంది..
సుమారు 6 నెలల పాటు అవకాడో తిన్న పలువురిపై అధ్యయనం నిర్వహించారు.. ఈ పండు తిన్న వారి రక్త నమూనాలను పరీక్షించి.. అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. అయితే.. ఆ వ్యక్తుల తుంటి, పొట్టలో పేరుకుపోయిన కొవ్వు, రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధకులు తెలిపారు.. మంచి ఆరోగ్యం కోసం ఈ ప్రత్యేకమైన పండును తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..