Artificial Sweeteners Side Effects: చక్కెర లేని టీ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దేశంలోనే కాదు ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న దృష్ట్యా, కృత్రిమ స్వీటెనర్ వాడకం కూడా పెరిగింది. దీన్ని తీసుకోవడం వల్ల రుచిలో చక్కెరకు లోటు ఉండదన్నది దీని ప్రత్యేకత. చాలా మంది ఇళ్లలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన కారణం కూడా ఇదే. కానీ, వీటిని అధికంగా వినియోగిచడం మాత్రం ఆరోగ్యానికి(Health) ప్రమాదకరమని రుజువు చేస్తుంది. కృత్రిమ స్వీటెనర్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై నిపుణులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తు్న్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచదార(Sugar)కు బదులు కృత్రిమ స్వీటెనర్ తీసుకోవడం ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు చక్కెరను తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కృత్రిమ స్వీటెనర్ల ట్రెండ్ పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా మారింది.
కృత్రిమ స్వీటెనర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా?
పీఎల్‌ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, కృత్రిమ స్వీటెనర్‌లలో ఎసిసల్ఫేమ్, అస్పర్టమే ఉంటాయి. దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, ఊబకాయం-సంబంధిత క్యాన్సర్ లేదా మరేదైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ స్వీట్ పిల్స్ వల్ల ఆందోళన, బ్లడ్ షుగర్ అసమతుల్యత, కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు.
ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం..
ఊబకాయం, అధిక రక్త చక్కెర, ఇన్సులిన్ అసమతుల్యత, మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు, కళ్ళు బలహీనత, ఒత్తిడి, ఆందోళన, మానసిక కల్లోలం, జీర్ణక్రియలో బలహీనతలు రావొచ్చు. చక్కెర రహిత ఆహార ఉత్పత్తుల కారణంగా, పిల్లలలో మధుమేహం వేగంగా పెరుగుతోందని అంటున్నారు.
చక్కెర లేని ఆహార ఉత్పత్తులలో నిజంగా చక్కెర ఉండదా..
షుగర్ ఫ్రీ అని ఉన్న ఆహార ఉత్పత్తులలో, నిజానికి కొంత మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. కాబట్టి షుగర్ ఫ్రీ అనే పదార్థాల్లో షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్, డైట్ డ్రింక్స్, సపోర్టు డ్రింక్స్, బెవరేజెస్, మయోనైస్, శీతల పానీయాలు తీసుకుంటే వాటిలో షుగర్ కూడా ఉందని భావించండి. ఇటువంటి అనేక మందులు కూడా ఉన్నాయి. వీటిలో చక్కెర ఉపయోగిస్తారు. అయితే, వీటి గురించి పెద్దగా ప్రచారం చేయరు.
ఈ పద్ధతులు పాటించండి..
నిపుణుల ప్రకారం, ఆహారంలో స్వీట్లను చేర్చుకోకుండా ఉండలేని వ్యక్తులు, వారు కొన్ని సహజ స్వీటెనర్లను ఉపయోగించవచ్చు. శరీరానికి ఎటువంటి హాని ఉండదు. తీపి కోరిక కూడా నెరవేరుతుంది. స్టెవియా ఆకులు సహజ స్వీటెనర్‌గా పనిచేస్తాయి. ఇది కాకుండా, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, తాజా పండ్లు, బెల్లం లేదా స్టెవియా ఆకుతో చేసిన మిఠాయిని కూడా సహజ స్వీటెనర్‌గా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో అధికా లాభాలు కూడా మనకు అందుతాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, చిట్కాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు కచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది.
Also Read: Health Tips: నాజూకైన నడుము కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!
Health Tips: పరగడుపున ఈ పానీయాలు తాగండి.. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..!